Rahul Gandhi in Kathmandu: ఖాట్మండు నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ‌తో ఉన్న మహిళ ఎవరు..?

రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడమే గాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోలో రాహుల్‌ పక్కన కన్పించిన మహిళ ఎవరన్నదీ చర్చనీయాంశంగా మారింది.

Rahul Gandhi in Kathmandu: ఖాట్మండు నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ‌తో ఉన్న మహిళ ఎవరు..?
Rahul Gandhi In Kathmandu
Follow us

|

Updated on: May 04, 2022 | 1:13 PM

Rahul Gandhi in Kathmandu: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రతిసారీ ఎదోక అంశంగా ఎప్పుడు వార్తల్లోకి ఎక్కితుంటారు. అయితే ఈసారి వ్యాఖ్యల గురించి ప్రకటన కాకుండా ఒక వీడియో గురించి దేశవ్యాప్తంగా ఆసక్తిర చర్చ జరుగుతోంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఓ నైట్‌క్లబ్‌లో ఓ మహిళతో కలిసి కనిపిస్తున్నారు. ఈ వీడియోను భారతీయ జనతా పార్టీ యువనేత సురేంద్ర శర్మ పోస్ట్ చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియో షేర్ చేయడంతో చాలా రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా అవాక్కయ్యారు.

రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఓ నైట్‌క్లబ్‌లో ఓ మహిళతో కలిసి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, సురేంద్ర వర్మ రాశారు, మీరు ఎవరో తెలియదు, కానీ ముఖం తెలిసినట్లుగా ఉంది. ఈ వీడియో లార్డ్ ఆఫ్ డ్రింక్ నేపాల్ నుంచి బయటకు వచ్చింది. మే 5న నేపాల్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో సుమణిమా ఉదాస్ వివాహానికి అధికారికంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి చేరుకున్నారు.

రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడమే గాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోలో రాహుల్‌ పక్కన కన్పించిన మహిళ చైనా రాయబారి అని వార్తలు రావడంతో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. పలువురు రాజకీయ నేతలు ఆమె నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ అని పేర్కొనడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే దీనిపై ఓ మీడియా సంస్థ ఫ్యాక్ట్‌ చెక్‌ చేయగా.. అది అవాస్తవమని తేలింది. ఆ మహిళ.. సీఎన్‌ఎన్‌ మాజీ కరస్పాడెంట్ సుమ్నిమా ఉదాస్‌ స్నేహితురాలని, ఆమె నేపాల్‌ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ నైట్‌ క్లబ్‌ యజమాని సైతం క్లారిటీ ఇచ్చారు. రాహుల్‌తో పాటు ఆరుగురు స్నేహితులు వచ్చారని, అయితే అందులో ఎవరూ చైనా దేశస్థులు లేరని క్లబ్‌ యజమాని చెప్పినట్లు పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు రాహుల్‌ ఆ క్లబ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌ సోమవారం ఖాట్మండు వెళ్లారు. విందులో భాగంగా రాహుల్ ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి నిన్న సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరుస పరాజయాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీని గాలికి వదిలి, ఆయన నేపాల్‌లో పబ్‌లో గడుపుతున్నారని కమలనాథులు ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ధీటుగా సమాధానం ఇచ్చారు. స్నేహితురాలైన ఒక విలేకరి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్‌ వెళ్లారని పేర్కొంది. ‘‘అదేమీ నేరం కాదుగా’’ అంటూ రాహుల్ గాంధీకి వత్తాసు పలుకుతున్నారు.

Read Also…  Alcohol: మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..? ప్రమాదమే.. ఇవి పూర్తిగా దెబ్బతింటాయి..!