Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Visa: వీసాదారులకు అమెరికా గుడ్‌న్యూస్.. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ గడువు పొడగింపు

భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. విదేశీయులకు ఊరట కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

US Visa: వీసాదారులకు అమెరికా గుడ్‌న్యూస్.. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ గడువు పొడగింపు
Us Visa
Follow us
Balaraju Goud

|

Updated on: May 04, 2022 | 12:41 PM

US Work Permit VISA: భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. విదేశీయులకు ఊరట కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ పర్మిట్‌ వీసా గడువును పొడిగించాలని నిర్ణయించింది. అమెరికాలో నివస్తున్న విదేశీయుల్లో కొన్ని కేటగిరీల వారికి మరో 18 నెలల పాటు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు.. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు కూడా ఉన్నారు. ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి రానున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ (ఈఏడీ)ల గడువు తీరిన తర్వాత కూడా 180 రోజుల వరకు అనుమతి ఉంటుంది. తాజాగా దాన్ని 540 రోజులు (18నెలల వరకు) ఆటోమేటిక్‌గా పొడిగిస్తున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (యూఎస్‌ఐఎస్‌సీ) తెలిపింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల వద్ద ఈఏడీల రెన్యూవల్‌కు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌ఐఎస్‌సీ డైరెక్టర్‌ తెలిపారు.

తాజా నిర్ణయంతో ఈఏడీ రెన్యూవల్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వలసదారులు తమ వర్క్‌ పర్మిట్ గడువు ముగిసినా.. మరో 540 రోజుల పాటు పని అనుమతులు పొంది ఉద్యోగాలు కొనసాగించొచ్చు. తద్వారా అమెరికాలో ఉద్యోగుల కొరత కొంత తగ్గడంతో పాటు వలసదారుల కుటుంబాలకు కూడా ఆర్థికంగా సహకారం లభిస్తుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 87వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు దాదాపు 4.20లక్షల మంది వలసదారులు పని అనుమతులు కోల్పోకుండా ఉంటారని ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం.

Read  Also…  సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా జైళ్లు.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు