నిపా వైరస్, కరోనా వైరస్‌ మధ్య తేడాలేంటి.. ఈ రెండింటిలో ఏది మరింత ప్రమాదం..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 07, 2021 | 8:06 AM

NIPAH And Corona: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళ నుంచి చాలా కేసులు వస్తున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం

నిపా వైరస్, కరోనా వైరస్‌ మధ్య తేడాలేంటి.. ఈ రెండింటిలో ఏది మరింత ప్రమాదం..
Nipah Virus

NIPAH And Corona: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళ నుంచి చాలా కేసులు వస్తున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా మాత్రమే కాకుండా నిపా వైరస్ కూడా విస్తరిస్తోంది. కోజికోడ్ జిల్లాలోని మావూర్‌లో12 ఏళ్ల చిన్నారి నిపా వైరస్‌తో మరణించడంతో వైద్య నిపుణులు కలవరపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిపా వైరస్ (NiV) ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులలో, మానవులలో తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. తాజాగా తెలిసిన విషయమేమిటంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తేల్చారు. ప్రస్తుతం కేరళ కరోనా ముప్పుతో పాటు నిపా ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది.

నిపా, కరోనా వైరస్ నిపా వైరస్ అనేది జూనోటిక్ ఇన్ఫెక్షన్ (జాతుల మధ్య, జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే అంటు వ్యాధి). 1999 లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వ్యాధికి మలేషియాలోని సుంగై నిపా అనే గ్రామం పేరు పెట్టారు. నిపా వైరస్ పందులు, కుక్కలు, మేకలు, పిల్లులు, గుర్రాలు, గొర్రెల నుంచి సంక్రమిస్తుంది. ఇది వ్యాధి నిర్ధారక లక్షణాలను చూపించదు. మరోవైపు చైనాలోని వుహాన్‌లో మొదటి కేసు గుర్తించిన ఇరవై నెలల తర్వాత కూడా, SARS COV-2 మూలం తెలియడం లేదు. మొదట్లో ఇది వుహాన్ లోని మార్కెట్ నుంచి వచ్చిందన్నారు. ఇది “మేడ్-ఇన్-ల్యాబ్”, “మేడ్-ఇన్-చైనా” వైరస్ అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాస్త్రీయంగా మాత్రం ఇప్పటి వరకు నిర్దారణ కాలేదు.

నిపాకు నివారణ లేదు కరోనా లాగా నిపా వైరస్‌కు కూడా నివారణ లేదు. ఈ రెండింటికి ఇప్పటివరకు యాంటీవైరల్ మందు కనుగొనలేదు. నిపా వైరస్ ((NiV)) కోసం లైసెన్స్ పొందిన చికిత్స అందుబాటులో లేదు. CDC ప్రకారం “ఇమ్యునోథెరపీటిక్ చికిత్సలు (మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ) ప్రస్తుతం నిపా వైరస్ సోకిన వారికి చేస్తున్నారు.

అనారోగ్యం లక్షణాలు నిపా వైరస్ సోకిన వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కొంతమంది రోగులలో నాడీ సంబంధిత సమస్యలు ఉంటాయి. 1998-99 సంవత్సరంలో ఈ వ్యాధి కేరళలో వేగంగా వ్యాపించింది. ఆ సమయంలో 265 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులలో చేరిన రోగులలో 40 శాతం మంది తీవ్రమైన నాడీ వ్యాధులతో బాధపడేవారే. సాధారణంగా ఈ వైరస్ గబ్బిలాలు, పందులు లేదా వ్యాధి సోకిన ఇతర మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. మలేషియా, సింగపూర్‌లో, ఇది పందుల ద్వారా వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే భారతదేశం, బంగ్లాదేశ్‌లో మనిషి నుంచి మనిషికి సోకే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

Warangal District: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెడ్ అలర్ట్..! పలు మండలాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు..

Catwalk: నడిరోడ్డుపై మహిళలు, చిన్నారుల క్యాట్ వాక్.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu