మహారాష్ట్రలో జరుగుతున్నది ‘వికాసం’ కాదు, అది ‘ వసూళ్ల రాజ్యం’, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
మహారాష్ట్రలో జరుగుతున్నది 'వికాసం' (అభివృద్ధి) కాదని, అక్కడ ఉన్నది 'వసూళ్ల రాజ్యమని' కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన అవినీతి....

మహారాష్ట్రలో జరుగుతున్నది ‘వికాసం’ (అభివృద్ధి) కాదని, అక్కడ ఉన్నది ‘వసూళ్ల రాజ్యమని’ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం..వసూళ్ల కోసమే పని చేస్తున్నదని, సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని కూడా రవిశంకర ప్రసాద్ దుయ్యబట్టారు. ఆయన (శరద్ పవార్) తప్పుడుగా మాట్లాడినందుకు ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. మహారాష్ట్ర మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్.. రాష్ట్ర హోం మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రికి రాసిన లేఖ పెను దుమారాన్ని సృష్టించింది. నగరంలోని బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెలా 100 కోట్లను వసూలు చేయవలసిందిగా మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఆయన ఆదేశించారంటూ సింగ్ ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే అనిల్ దేశ్ ముఖ్ ని తొలగించే ఉద్దేశం లేదని, సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమని శరద్ పవార్ ప్రకటించారు. అటు మహారాష్ట్ర వ్యవహారం నిన్న పార్లమెంటులో కూడా తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం రాజీనామా చేయాలని పార్లమెంటులో బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. వెంటనే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు కోరారు. ఈ రభసతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. లోక్ సభలో శివసేన, బీజేపీ సభ్యులు పెద్దఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఇలా ఉండగా బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ముఖ్యమంత్రి పైన, శరద్ పవార్ తో బాటు అనిల్ దేశ్ ముఖ్ పై మంగళవారం కూడా ఆరోపణలు చేశారు. మరో వైపు అనిల్ దేశ్ ముఖ్ మళ్ళీ వీడియోలను విడుదల చేసి తనపై పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలన్నీ కట్టు కథలని పేర్కొన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమంత ఓల్డ్ వీడియో.. చూసి ఫ్యాన్స్ షాక్..!: Samantha old viral video. సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.
తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్…కీలక ప్రకటన: Telangana Schools bandh Live Video.