BREAKING NEWS: మావోల ఘాతుకం.. జవాన్లు వెళ్తున్న బస్సుపై ఐఈడీతో దాడి.. నలుగురు మృతి
ఛత్తీస్‌ఘడ్ జిల్లా నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ విరుచుకుపడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు....

Chhattisgarh IED Blast: ఛత్తీస్‌ఘడ్ జిల్లా నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ విరుచుకుపడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. మరో 10 మందికి స్వల్ప గాయాలైనట్లు ఛత్తీసగఢ్ డీజీపీ అవస్థి వెల్లడించారు. 45 వ బెటాలియన్ ఐటిబిపి సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Three District Reserve Guard (DRG) jawans have lost their lives and a few injured in IED blast triggered by Naxals in Narayanpur district; details awaited: DGP Chhattisgarh, DM Awasthi
(file photo) pic.twitter.com/TEGAwTAUDJ
— ANI (@ANI) March 23, 2021
Chhattisgarh: Three District Reserve Guard (DRG) jawans and one police personnel lost their lives in an IED blast by naxals in Narayanpur today. 14 security personnel injured, including two critical.
(Pic Source: ITBP) pic.twitter.com/qlCPJmQXpl
— ANI (@ANI) March 23, 2021
ప్రమాద సమయంలో బస్సులో 27 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ఏరియాకు చేరుకున్న భారత బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గత సంవత్సరం (మార్చి 22, 2020) బస్తర్‌లో భయంకరమైన నక్సల్ దాడి జరిగింది. ఇందులో 17 మంది జవాన్లు ( ఐదుగురు ఎస్టీఎఫ్, 12 మంది డిఆర్‌జి) మరణించారు.
Also Read: తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్… ప్రభుత్వం కీలక ప్రకటన
COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్