AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT Satta Sammelan: మా నాన్న వల్ల స్కూల్‌‌కు ఎప్పుడూ బంక్ కొట్టలేదు.. పంజాబ్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సత్తా సమ్మేళన్ ఢిల్లీ వేదికగా మూడోరోజు కొనసాగుతోంది. ప్రముఖవ్యక్తులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరై.. పలు విషయాలపై క్లుప్తంగా మాట్లాడుతున్నారు. మంగళవారం జరిగిన పవర్ కాన్ఫరెన్స్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన చిన్ననాటి కథలను వివరిస్తూ సమావేశంలో కూర్చున్న వ్యక్తుల జ్ఞాపకాలను రిఫ్రెష్ చేశారు.

WITT Satta Sammelan: మా నాన్న వల్ల స్కూల్‌‌కు ఎప్పుడూ బంక్ కొట్టలేదు.. పంజాబ్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
Bhagwant Mann
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2024 | 4:25 PM

Share

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సత్తా సమ్మేళన్ ఢిల్లీ వేదికగా మూడోరోజు కొనసాగుతోంది. ప్రముఖవ్యక్తులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరై.. పలు విషయాలపై క్లుప్తంగా మాట్లాడుతున్నారు. మంగళవారం జరిగిన పవర్ కాన్ఫరెన్స్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన చిన్ననాటి కథలను వివరిస్తూ సమావేశంలో కూర్చున్న వ్యక్తుల జ్ఞాపకాలను రిఫ్రెష్ చేశారు. మీ నాన్న ఉపాధ్యాయుడైతే నీకు దెబ్బలు ఎక్కువ తగులుతాయంటూ చెప్పారు.. మనిషి ఇంకేదో ఆలోచిస్తాడని, దేవుడు అతడికి మార్గాన్ని సిద్ధం చేసే ఉంటాడని వివరించారు. చాలా సార్లు ఒక వ్యక్తి ఆలోచించని విధంగా చాలా పొందుతాడని.. ఇందంతా జీవితంలో జరుగుతూనే ఉంటుందని భగవంత్ మాన్ తెలిపారు.

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ లో భగవంత్ మాన్.. తన బాల్యం గురించి చెప్పారు. సంగ్రూర్ జిల్లాలో సతౌజ్ అనే చిన్న గ్రామం ఉందని.. అక్కడ తన బాల్యం గడించిందని తెలిపారు. తన నాన్న మహేంద్ర సింగ్ MA పొలిటికల్ సైన్స్, B.Sc, B.Ed చేశారు. ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక విద్యావంతుడు తమ నాన్న అని చెప్పారు. అతను సైన్స్ టీచర్ అని.. తర్వాత ప్రధానోపాధ్యాయుడు అయ్యారన్నారు. తనను కూడా అక్కడ చేర్చుకున్నారని వివరించారు. తాను ఏడో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు అల్లరి చేసే వయసు అదని.. మీరు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మీ నాన్న అయితే అది దారుణంగా ఉంటుందని వివరించారు.

రోజూ నా ఇంటికి రిపోర్టులు వచ్చేవి..

స్కూల్ కు నాన్న వెంట తీసుకెళ్లేవారని.. అందుకే తాను బంక్ కూడా చేయలేకపోయానన్నారు. నేను మహేంద్ర సింగ్ కొడుకునని ఉపాధ్యాయులందరికీ కూడా తెలుసు.. మీరు నమ్మినా నమ్మకపోయినా టీచర్ల పిల్లలను ఎక్కువగా కొట్టడం అయితే మానమంటూ.. కొడుతూనే ఉంటామంటూ చెప్పారన్నారు. మీ నాన్న టీచర్ అయితే, మీ రిపోర్ట్ కార్డ్ ప్రతిరోజూ మీ ఇంటికి చేరుతుంది. అలాంటి పరిస్థితిలో, మా నాన్నగారు మా టీచర్లకు రేపు అతడికి చెప్పండి అంటూ పని చెప్పేవారు.. మరుసటి రోజే ఆ టీచర్ వచ్చి నన్ను వినమని అడుగేవారంటూ ఫన్నీగా వివరించారు.

జీవితంలో ఏది ఉపయోగమో.. మనకు అది నేర్పిస్తున్నారు…

సత్తా సమ్మేళన్ వేదికపై, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఒక జోక్ చెప్పారు. ఈ రోజు అధ్యయనం అప్రస్తుతం. జీవితంలో ఏదో ఉపయోగపడుతూనే మనకు ఏదో నేర్పిస్తూనే ఉంటుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..