AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Char Sou Par: చార్‌ సౌ పార్‌ నినాదం ఏమైంది..? బీజేపీకి బలం ఎందుకు తగ్గింది..?

భారతీయ జనతా పార్టీ చార్‌ సౌ పార్‌ నినాదం మిషన్‌ ఇంపాజిబుల్‌గా మారిపోయింది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని ఎంతో ధీమాగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఇప్పుడు సొంతంగా మెజార్టీ సాధించడం గగనంగా మారింది. పదేళ్ల తర్వాత తొలిసారి ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాషాయదళానికి తలెత్తింది.

Mission Char Sou Par: చార్‌ సౌ పార్‌ నినాదం ఏమైంది..? బీజేపీకి బలం ఎందుకు తగ్గింది..?
Char Sau Paar Slogan
Balaraju Goud
|

Updated on: Jun 04, 2024 | 7:36 PM

Share

భారతీయ జనతా పార్టీ చార్‌ సౌ పార్‌ నినాదం మిషన్‌ ఇంపాజిబుల్‌గా మారిపోయింది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని ఎంతో ధీమాగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఇప్పుడు సొంతంగా మెజార్టీ సాధించడం గగనంగా మారింది. పదేళ్ల తర్వాత తొలిసారి ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాషాయదళానికి తలెత్తింది.

ఎన్నికలు షెడ్యూల్‌కు చాలా కాలం ముందే బీజేపీ చార్‌ సౌ పార్‌ నినాదాన్ని బీజేపీ అందుకుంది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు సొంతంగా బీజేపీకి 370 సీట్లు, NDA కూటమి 400 సీట్లు సాధిస్తుందని బీజేపీ అగ్రనేతలు పదేపదే తమ ప్రచారంలో ప్రస్తావించారు. బట్‌ అది వర్కౌట్‌ కాలేదు. ఫలితాలు చూస్తుంటే బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ మార్కు 241కు చేరుకోవడం సాధ్యం కాదనే విషయం తేటతెల్లమైంది. నిరుద్యోగం, ధరల పెరుగదల, అగ్నివీర్‌ పథకం బీజేపీకి భారంగా మారాయంటున్నారు నిపుణులు. సైన్యంలో అత్యధిక సంఖ్యలో యువకులు చేరే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకి సంఖ్యాబలం తగ్గడం అగ్నివీర్‌ ప్రభావమే అని చెప్పక తప్పదు.

బీజేపీ ఆలోచనలకు అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ పెద్ద దెబ్బకొట్టింది. అయోధ్యలో రామమందిరం కట్టక ముందు యూపీలో బీజేపీ ఎంతో ఆదరణ సాధించింది. 2019 ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను 62 చోట్ల విజయం సాధించింది. కానీ ఈసారి ఆ సంఖ్య సగానికి తగ్గింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి ప్రతీ సభలోనూ పదే పదే ప్రస్తావించినా యూపీ ఓటర్లు మాత్రం బీజేపీని అంతగా ఆదరించలేదు. ఇద్దరు కుర్రాళ్లు, ఇద్దరు యువరాజులంటూ రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ను ప్రతీ సభలోనూ ప్రధాని మోదీ విమర్శించడం యూపీ ఓటర్లు అంతగా ఆకట్టుకోలేదని అనుకోవాలి. ఇన్‌ఫ్యాక్ట్ ఆ మాటలు ఆ యువరాజుల వైపు ఆలోచించేలా చేశాయి.

అత్యధిక ఎంపీ సీట్లున్న మహారాష్ట్రలోనూ బీజేపీ బలహీనపడింది. NCP, శివసేనను చీల్చడం మహారాష్ట్ర ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. మహారాష్ట్ర బీజేపీ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఏక్‌నాథ్‌ షిండే పార్టీ ఆరు స్థానాలు, NCPని చీల్చి తనదే ఆ పార్టీ అని ప్రకటించుకున్న అజిత్‌ పవార్‌ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. సొంత రాష్ట్రం గుజరాత్‌ను వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌ చేయాలనుకున్న మోదీ-షా వ్యూహం ఈ ఎన్నికల్లో విఫలమైంది. పదేళ్ల తర్వాత తొలిసారి గుజరాత్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున ఒక ఎంపీ లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం తథ్యంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఉన్నంత అట్టహాసం, ఆర్భాటం ఉండకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…