Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవిత్ర నదికి పునరుజ్జీవం.. ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!

Yamuna River Clean: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో ఒకటి యమునా నది శుద్ధి పనులు. ఢిల్లీలో తమ ప్రభుత్వం కొలువుదీరక ముందే ఈ హామీని నెరవేర్చే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20న కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక నిర్ణయాలు తీసుకుని యమునా నది శుద్ధి పనులు ప్రారంభించారు.

పవిత్ర నదికి పునరుజ్జీవం.. ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!
Yamuna River Clean
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 18, 2025 | 11:39 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా మారిన యమునా నది శుద్ధి పనులు ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) యమునా నది శుద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చింది. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈ హామీ ఇచ్చినప్పటికీ.. ఐదేళ్లలో అమలు చేయలేకపోయింది. పైపెచ్చు నదిలో కాలుష్యం స్థాయులు నానాటికీ పెరిగిపోయాయి. చఠ్ పూజ, మౌని అమావాస్య వంటి పర్వదినాల్లో నదీ స్నానాలు చేసే ఉత్తరాదివాసులకు మురికి కాలువను తలపించేలా మారిన యుమునా నది ఒక శాపంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కమలదళం, ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యమునా నది శుద్ధి పనులు చేపడతామని ప్రకటించింది. చెప్పినట్టుగానే.. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేల్చక ముందే ఈ నెల 16 నుంచే యమునా నది శుద్ధి పనులను ప్రారంభించింది. ఈ నెల 20న కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు.

ప్రక్షాళనకు 4 మార్గాలు

యమునా నది ఉత్తరాఖండ్‌లో హిమాలయాలను వీడిన తర్వాత హర్యానా, యూపీ సరిహద్దుల మీదుగా ప్రవహించి ఢిల్లీ నగరాన్ని చేరుకుంటుంది. ఇక్కడి వరకు సాగించే ప్రయాణంలో నది పెద్దగా ఎక్కడా కలుషితం కావడం లేదు. కానీ ఎప్పుడైతే ఢిల్లీలోకి ప్రవేశిస్తుందో.. అక్కణ్ణుంచే నదికి కష్టాలన్నీ మొదలవుతున్నాయి. 3 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్న ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజయన్ నుంచి అనునిత్యం మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. ఢిల్లీని దాటిన తర్వాత మథుర, ఆగ్రా నగరాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ఢిల్లీలో 57 కి.మీ మేర ఈ నది ప్రవహిస్తోంది. ప్రభుత్వం ఢిల్లీలో ప్రవహించినంత మేర శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 4 అంచెల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాటిలో ఇప్పటికే కలగలిసిపోయిన కాలుష్యం చెత్తను తొలగించడం ఒకెత్తయితే, ఇకపై నదిలో కలుషిత జలాలు, మురుగు చేరకుండా నిరోధించడం మరో ఎత్తు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నవీన్ చౌదరి సోమవారం (ఫిబ్రవరి 17న) మీడియాతో మాట్లాడుతూ.. 2027 డిసెంబర్ నాటికి యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తామని చెప్పారు.

01. క్లీనింగ్ ఆపరేషన్:

ఇప్పటికే టన్నుల కొద్దీ చెత్త యమునా నదిలో ఉంది. దాన్ని శుభ్రం చేయడం కోసం ఫిబ్రవరి 16న యంత్రాలతో క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ట్రాష్ స్కిమ్మర్లు, వీడ్ హార్వెస్టర్లు, డ్రెడ్జి యుటిలిటీ యూనిట్లతో నదిని శుభ్రం చేయడం ప్రారంభించారు. ఈ యంత్రాలు నదిలో అడ్డదిడ్డంగా పెరిగిన కలుపు మొక్కలను తొలగించడంతో పాటు నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాయి. అలాగే మురుగునీటితో పేరుకుపోయిన మేటలను కూడా డ్రెడ్జింగ్ యంత్రాలు తొలగిస్తాయి.

02. సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు:

సాధారణంగా నగరాల్లో మురుగు నీరు నేరుగా నదిలో కలపకుండా శుద్ధి చేసిన తర్వాతనే విడుదల చేయాలి. నగరంలోని వివిధ కాలనీల నుంచి వచ్చిన ఆ మురుగునీటిని శుద్ధి చేయడం కోసం “సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు” (STP)లు అవసరమవుతాయి. కానీ ఢిల్లీలో ఇప్పటికే ఉన్న ఎస్టీపీల సామర్థ్యం సరిపోవడం లేదు. పైపెచ్చు అవి సరిగా పనిచేయడం లేదు. దీంతో ఉన్నవాటిని పూర్తి సామర్థ్యంతో పనిచేయించడంతో పాటు కొత్తగా మరో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గ్రహించారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్టు అదనపు ప్రధాన కార్యదర్శి నవీన్ చౌదరి వెల్లడించారు.

03. కాలుష్యకారక పరిశ్రమల మూసివేత:

నదిని తీవ్రంగా కలుషితం చేస్తున్నవాటిలో పారిశ్రామిక వ్యర్థాలు ఒకటి. అవి ప్రాణాంతక రసాయన వ్యర్థాలతో కూడి ఉంటాయి. పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా నదిలో కలపకుండా చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో నదిలోకి నేరుగా కాలుష్య జలాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను మూసేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

04. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కేంద్రాలు:

పారిశ్రామిక వాడల్లో అన్ని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు “కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్” (CETP)లు ఉంటాయి. ఢిల్లీలోని పారిశ్రామిక వాడల్లో ఉన్న ఈ CETPలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. “ఆపరేషన్ క్లీన్ యమున”లో భాగంగా ప్రతి పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతనే నదిలోకి విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ శుద్ధి చేయడం సాధ్యపడని పరిశ్రమలను మూసేయడం లేదా ఢిల్లీ నుంచి మరో చోటకు తరలించడం వంటి ప్రత్యామ్నాయలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.

ఇన్ని చేసినా నదిలో అక్కడక్కడా కలుషిత జలాలు వచ్చి కలుస్తూనే ఉంటాయి. అయితే స్వల్పమొత్తంలో కలిసే కాలుష్యం సహజ ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. కానీ పెద్దమొత్తంలో కలుషిత జలాలు కలిసినప్పుడు పాల నురుగు మాదిరిగా నదిపై తేలియాడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి నుంచి విముక్తి కల్పించి.. పర్వదినాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పరిశుభ్రమైన జలాలను అందించడం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించాయి.

నదులను దేవతలుగా కొలిచే దేశంలో…

నదులను దేవతలుగా కొలిచే దేశంలో జీవనదులు మురికి కూపాలుగా మారుతున్నాయి. ఇలాంటి సెంటిమెంట్లు ఏవీ లేని యూరప్, అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో నదులను అత్యంత శుభ్రంగా కాపాడుకుంటున్నారు. ఆ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలోనూ అందిపుచ్చుకుని నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నదీమతల్లులకు ప్రతిరోజూ హారతి ఇస్తున్న దేశంలో.. నదీ జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అడుగడుగునా దేవతగానే భావించాలి. అప్పుడే నదిని కలుషితం చేయకూడదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఒకసారి నదిని శుభ్రంగా కాపాడుకోగల్గితే.. ఆ తర్వాత సుందరీకరణ పనులు కూడా చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!