Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

Samatha J

|

Updated on: Feb 18, 2025 | 1:46 PM

విశాఖపట్నం గోపాలపట్నంలోని నందమూరి కాలనీలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలచివేసింది. కొత్తగా పెళ్లయిన ఆమె భర్త నాగేంద్రబాబు యూట్యూబ్ లో అశ్లీల వీడియోలు చూసి, ఆమెతో వికృతంగా ప్రవర్తించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. నాగేంద్రబాబు పొటెన్సీ కోసం మందులు వాడినట్లు గోపాలపట్నం సీఐ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి అక్క ఆవేదన వ్యక్తం చేస్తూ, తన చెల్లిని కాపాడుకోలేకపోయినందుకు బాధపడుతోంది. తన చెల్లి మరణానికి కారకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

ఇది మనసున్న ప్రతి మనిషినీ కదిలించే కేసు. మదమెక్కి కొట్టుకుంటున్నా ఒక మృగాడి కేసు. అతగాడి వేదనలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న నవ వధువు కేసు ఇది. కొత్తగా పెళ్లయ్యి కోటి ఆశలతో మెట్టినింటి అడుగుపెట్టింది ఆ యువతి. తన భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కందింది. భర్త, పిల్లలు, అత్తమామల గురించి ఆమెకు ఎన్నో మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ భర్త టార్చర్ ముందు ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. మద పిచ్చితో అతడు చేసిన పని ఆమెను ఉసురు తీసింది. భర్త వేదనలు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నం లోని గోపాలపట్నం, నందమూరి కాలనీలో జరిగింది ఈ ఘటన.ఈ ఘటనపై గోపాలపట్నం సిఐ వర్షన్ ఇప్పుడు చూద్దాం. నిందితుడు నాగేంద్రబాబు యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు చూసి భార్యతో ప్రయోగాలు చేసేవాడని చెప్పారు. పొటెన్సీ కోసం భర్త నాగేంద్ర కొన్ని మందులు తీసుకున్నట్లుగా గుర్తించామని కూడా చెప్పారు. దీనిని స్పెషల్ కేసుగా దర్యాప్తు చేస్తున్నామని టివి నేరం తో సిఐ చెప్పారు. వసంత ఆత్మహత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మాతో ఇదే అంశం మాట్లాడటానికి సిఐ అప్పారావు ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆ టైంలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో

బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్‌!

అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!

గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్