Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో

మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో

Samatha J

|

Updated on: Feb 18, 2025 | 2:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్‌కు రెండు రోజుల పర్యటన ముగించారు. ఈ పర్యటనలో అనేక ముఖ్యమైన చర్చలు జరిగాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ సమావేశమయ్యారు, వీరిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ట్రంప్ మోడీని "మిత్రమా" అని పిలుస్తూ, తనకు ఆయనను చాలా మిస్ అయ్యారని తెలిపారు. ఈ భేటీ వైట్ హౌస్‌లో జరిగింది, దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మోడీ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, ఎలోన్ మస్క్ మరియు వివేక్ రామస్వామితో కూడా సమావేశమయ్యారు. మస్క్ పిల్లలకు మోడీ బహుమతులు అందించారు. మొత్తంమీద, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసింది.

అమెరికాలో భారత ప్రధాని మోడీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో అనేక విషయాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య అవగాహనలు, ఒప్పందాలు జరిగాయి. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ట్రంప్, మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను మిత్రమా అంటూ మోడీని ఉద్దేశించి అన్నారు. ప్రతిగా తనకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది అని మోడీ కూడా అన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ లాబీలో ఈ సమావేశం జరిగింది. మోడీకి ఘనంగా స్వాగతం పలికిన ట్రంప్ కరచాలనం చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మోడీ సైతం ట్రంప్ ను ఆప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియోని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్స్ కావినో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అంతకుముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తోలసి గబార్ట్ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మస్క్ పిల్లలకు మోడీ కొన్ని బహుమతులు అందజేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆ టైంలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో

బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్‌!

అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!

గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్