Priyamani: ఇదేందయ్యా ఇది..! ఈ తోపు హీరోయిన్ ప్రియమణి అక్కా.. ఆమె ఎవరో తెలుసా..?
తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి ప్రియమణి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం.

ప్రియమణి.. ఈ అందాల విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎలాంటి పాత్ర అయినా సరే యిట్టె ఒదిగిపోతుంది ప్రియమణి. గ్లామరస్ పాత్ర అయినా, డీ గ్లామర్ పాత్ర అయినా సరే సై అంటూ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ అమ్మడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. పెళ్ళైన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ప్రియమణి. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బిజీగా మారింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది.
అంతే కాదు తన నటనకు జాతీయ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియమణి సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగు తమిళ్ తో పాటు హిందీలోనూ నటించింది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ అంతకు ముందు షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇదిలా ఉంటే ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమెకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎవరో తెలుసా.?
ప్రియమణి సిస్టర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు డర్టీ పిచ్చర్ లాంటి సినిమాతో అందరిని షాక్ చేసిన విద్యాబాలన్. అవును విద్యాబాలన్ ప్రియమణి సిస్టర్స్ అవుతారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.అలాగే డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా ఆమె ఫెమస్ అయ్యింది. సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విద్యాబాలన్ తెలుగులో బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలు చేసింది. NTR కథానాయకుడు, NTR మహానాయకుడు సినిమాల్లో నటించింది. కాగా విద్య బాలన్ తనకు కజిన్ అవుతుందని ప్రియమణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




