అస్సులు ఏమి మారలేదు: లావణ్య..
Prudvi Battula
18 February 2025
అప్పటి ఇప్పటికి ఏం మారింది? ఏమీ మారలేదు అని అంటున్నారు టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి.
ఇంతకీ మెగా కోడలు ఏ విషయంలో ఈ మార్పు గురించి మాట్లాడుతున్నారు? అని ఆలోచిస్తున్నారా? ఆగండాగండి... నేనే చెప్పేస్తా.
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మార్పు గురించి మాట్లాడుతోంది ఆమె సినిమా కెరీర్ విషయంలో మరింకేంటి కాదు.
సినీ కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా పెద్దగా సినిమాలేం చేసేయలేదు హీరో వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి.
ఇండస్ట్రీలో తాను నటించబోయే సినిమాల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు ఆచితూచి అడుగులు వేసేవారు మెగా కోడలు లావణ్య.
నటిగా పేరు తెచ్చే సినిమాల్లో, హుందాగా అనిపించే పాత్రల్లో చేసేవారు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా అదే ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ.
లావణ్య సినిమాల విషయంలో వరుణ్‌తేజ్ కలగజేసుకుంటారా? అని అడిగితే బిగ్ నో అని ఆన్సర్ ఇస్తారు ఈ టాలీవుడ్ లేడీ.
తాను సెలక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే ఎప్పుడైనా వింటారేమో కానీ, ఎప్పుడూ ఇన్వాల్వ్ కారు అని అంటున్నారు లావణ్య.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క చేసిన ఈ పాత్రలకు టేక్ ఏ బౌ అనాల్సిందే..
మంచి కిక్కే ఇచ్చే ఈ తెలుగు స్పోర్ట్ డ్రామాలు కచ్చితంగా చూడాలి..
ఫుడ్ టూ సినిమా.. డార్లింగ్‌కి ఇష్టమైనవి ఇవే..