సన్నగా మెరుపు తీగలా మారాలనుకుంటున్నారా? అయితే ఇది తినేయండి
18 February 2025
TV9 Telugu
TV9 Telugu
కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది
TV9 Telugu
పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి
TV9 Telugu
పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి
TV9 Telugu
శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకోండి. దీనిలో ఉండే ప్రోటీన్లు మంచి ఫలితాన్నిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి నిత్యం యవ్వనంగా ఉండే చేస్తుంది
TV9 Telugu
పెరుగులోని ప్రోబయోటిక్స్ కడుపును శుభ్రంగా ఉంచుతాయి. అయితే పెరుగుతో నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
పెరుగులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని నల్ల మిరియాలతో కలిపి తింటే ఇందులోని పోషకాలతో కలిసి బరువు సులువుగా తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
అంతేకాకుండా పెరుగు, నల్ల మిరియాలు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక గిన్నె పెరుగులో చిటికెడు నల్ల మిరియాలు వేసి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
TV9 Telugu
పెరుగులో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో నల్ల మిరియాలు వేసి తినడం వల్ల ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. అయితే అలెర్జీలు, కడుపు చికాకు, ఉబ్బసం, అధిక రక్తపోటు ఉన్నవారు నల్ల మిరియాలను తినకపోవడమే మంచిది