Teachers Job Scam: హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన 26 వేల మంది ఉపాధ్యాయులు..!

ఒకటో రెండో కాదు.. ఏకంగా 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోంది బెంగాల్ ప్రభుత్వం ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు చేసిన అన్ని నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.

Teachers Job Scam: హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన 26 వేల మంది ఉపాధ్యాయులు..!
Bengal Job Scam
Follow us

|

Updated on: Apr 23, 2024 | 9:14 AM

ఒకటో రెండో కాదు.. ఏకంగా 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోంది బెంగాల్ ప్రభుత్వం ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు చేసిన అన్ని నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. 2016లో ‘స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్’ ద్వారా పాఠశాలల్లో నియామకాలు జరిగాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌గా పేరొందిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన కోర్టు.. నియామకాల్లో అవకతవకలను గుర్తించింది.

పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో సంచలన తీర్పు ఇచ్చింది కలకత్తా హైకోర్టు. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌- SLST నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ, ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇప్పటి వరకూ తీసుకున్న జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. వెంటనే కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను సూచించింది. ఈ తీర్పుతో 25,753 మంది ఉపాధ్యాయుల నియామకాలు ప్రమాదంలో పడ్డాయి.

2016లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయుల నిమామకం కోసం SLST నిర్వహించారు. ఈ ప్రక్రియ కింద జరిగిన నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభ కోణంలో నాటి బెంగాల్‌ విద్యాశాఖమంత్రి, తృణమూల్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కల్‌కత్తా హైకోర్టు ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆరోపణలు ఉన్న ఉద్యోగాలను మాత్రమే రద్దు చేయాలని, మిగతా ఉపాధ్యాయులను కొనసాగించాలని మమతా బెనర్జీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే రాజకీయ దూమారం సృష్టిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?