AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: దీదీ దేశభక్తి ఇదేనా?.. జాతీయ గీతాన్ని మమత అవమానించారంటూ బీజేపీ శ్రేణుల ఆగ్రహం.. వైరలవుతోన్న వీడియో..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానపరిచారంటూ బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి

Mamata Banerjee:  దీదీ దేశభక్తి ఇదేనా?.. జాతీయ గీతాన్ని మమత అవమానించారంటూ బీజేపీ శ్రేణుల ఆగ్రహం.. వైరలవుతోన్న వీడియో..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 11:49 AM

Share

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానపరిచారంటూ బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బుధవారం ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత జాతీయ గీతం పూర్తి కాకుండానే ముగించారంటూ ముంబయి బీజేపీ నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దీదీ దేశభక్తి ఇదేనా? అంటూ ముంబయి బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఒక వీడియోను షేర్‌ చేస్తూ ‘మన జాతీయతకు గుర్తింపునిచ్చే అత్యంత శక్తివంతమైన వాటిలో మన జాతీయ గీతం ఒకటి. బాధ్యతగల పదవులు, హోదాల్లో ఉన్న వారు దీనిని ఏ మాత్రం కించపర్చలేరు. కానీ మన బెంగాల్‌ ముఖ్యమంత్రి జాతీయ గీతాన్ని అసంపూర్ణంగా పాడి ముగించారు. దీదీ దేశభక్తి ఇదేనా?’ అని ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియోలో మమతా బెనర్జీ జాతీయ గీతం ప్రారంభిస్తున్న సమయంలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లేచి నిల్చున్నారు. కానీ మధ్యలోనే జాతీయ గీతాన్ని ముగించారు.

కూర్చొని పాడి అవమానిస్తారా? పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ కూడా ఈ మమతపై విమర్శలు సంధించారు. ‘ రాజ్యాంగ పదవిలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని కూర్చొని పాడి అవమానించారు. ఆమెకు జాతీయ గీతానికి ఉన్న గౌరవం, విలువ తెలియదా? లేక తెలిసే అవమానిస్తున్నారా’ అని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ వీడియోలు వైరల్‌గా మారిన తర్వాత ముంబయి బీజేపీ నాయకుడు ఒకరు మమతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ముంబయిలో పర్యటించిన దీదీ సివిల్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజీ మెమన్, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, దర్శకుడు మహేష్ భట్, నటీమణులు రిచా చద్దా, స్వరా భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:

Parliament: మళ్లీ సేమ్‌ సీన్‌.. పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల ఆందోళన.. ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేసేది లేదన్న వెంకయ్య

Viral Video: వాట్ ఏ ఐడియా సర్‌జీ.. క్షణాల్లో కుక్కర్ ప్రెజర్‌తో వేడి వేడి కాఫీ.. టేస్ట్ ఎంజాయ్ చేస్తున్న కస్టమర్స్.. వైరల్ వీడియో

Man Lost Wife in gambling: యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగి వచ్చేసిందని ట్రిపుల్ తలాక్!