West Bengal Bandh : రసవత్తరంగా మారిన బెంగాల్ రాజకీయాలు.. ఉదయం నుంచే నిరసన సెగలు..
Bandh : బెంగాల్ రాజకీయం రసవత్తంగా మారుతుంది.. బీజేపీ వర్సెస్ టీఎంసీ కాస్త.. ఇప్పుడు టీఎంసీ వర్సెస్ విపక్షలుగా మారిపోయింది..ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షలు పన్నెండు గంటలపాటు నిరసనకు...
Bengal Bandh : బెంగాల్ రాజకీయం రసవత్తంగా మారుతుంది.. బీజేపీ వర్సెస్ టీఎంసీ కాస్త.. ఇప్పుడు టీఎంసీ వర్సెస్ విపక్షలుగా మారిపోయింది..ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షలు పన్నెండు గంటలపాటు నిరసనకు పిలుపునిచ్చాయి..దీంతో ప్రసుత్తం బెంగాల్ సీఎం దీదీ పరిస్థితి పోయి మీద నుంచి పెన్నం మీద పడినట్లు అయ్యింది..
వెస్‌బెంగాల్‌లో నిరసన అగ్గి రాజుకుంది..కోల్‌కతా సచివాలయం వైపు ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినందుకు నిరసనగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే లెఫ్ట్ పార్టీల నిరసన ప్రారంభించాయి.. పలు చోట్ల టైర్లను తగలబెడుతూ మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..మరికొన్ని చోట్ల రైలుకు అడ్డంగా నిలబడి తమ నిరసను వ్యక్తం చేశారు..తమ హక్కుల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై పోలీసు బలగాలు పంపి దాడి చేయిస్తారా అంటూ వామపక్ష ఐక్య వేదిక చైర్మెన్ బిమన్ బోస్ మండిపడ్డారు..
కోల్‌కతాలోని ఎస్పా్లనేడ్ ప్రాంతంలో ఉద్యోగాలు కోరుతూ ర్యాలీ జరుపుతున్న వామపక్ష, కాంగ్రెస్, విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా ఈ బంద్ ప్రకటించారు..ఈ లాఠీచార్జ్‌లో 150 మంది విద్యార్థులు గాయపడ్డారని లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ చెప్పారు. బారికేడ్లను విఛ్చిన్నం చేసేందుకు యత్నించిన విద్యార్థులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఎన్నికల నేపథ్యంలో బంద్ పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ సహా లెఫ్ట్ పార్టీలు గురువారం పశ్చిమ బెంగాల్ రాజధాని నబన్నలోని రాష్ట్ర సచివాలయానికి ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ ఘర్షణగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వాటర్ కెనాన్లు ప్రయోగించారు, స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. దీనిని ఖండిస్తూ శుక్రవారం 12 గంటల నిరసనకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
North 24 Paraganas: Left party workers block train track at Kanchrapara railway station, to protest after its workers were allegedly beaten up during a march to Nabanna in Kolkata yesterday
The Left Front has called a 12-hour bandh in West Bengal today. pic.twitter.com/mbA5M83z7m
— ANI (@ANI) February 12, 2021
ఇవి కూడా చదవండి
Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం Singareni Job Notification : సింగరేణి కొలువులకు భారీగా పోటీ.. పరీక్షల్లో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు..!