West Bengal Elections 2021: మరికొద్ద గంటల్లో ఎన్నికలు.. టీఎంసీ పార్టీ కార్యాలయం ముందు బాంబ్ పేలుళ్లు.. పశ్చిమబెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్త..
West Bengal Elections 2021: మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనుండగా.. పశ్చిమబెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బంకురా జిల్లా..
West Bengal Elections 2021: మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనుండగా.. పశ్చిమబెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బంకురా జిల్లా జోయ్‌పూర్‌ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పేలుళ్లలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, ఈ పేలుళ్లలపై టీఎంసీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో తమను, ప్రజలను భయపెట్టేందుకే విపక్ష నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. టీఎంసీ నేతల ఆరోపణలపై బీజేపీ అధికారులు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం లోప బాంబులు తయారు చేస్తున్నారని, అవి ఫెయిల్ అవడంతో పేలుడు సంభవించిందని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే.. టీఎంసీ కార్యకర్తలు, ఐఎస్ఎఫ్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
ఇదిలాఉంటే.. టీఎంసీ కార్యాలయం ముందు బాంబు పేలుళ్లపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ దన్‌ఖర్ స్పందించారు. జరిగిన పేలుళ్ల పట్ల బాధను వ్యక్తం చేస్తారు. ఈ హింసను చూసి తాను చాలా బాధపడ్డానని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. ఎన్నికల వేళ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచాలని వెస్ట్ బెంగాల్ పోలీసు అధికారులకు గవర్నర్ జగ్‌దీప్ ఆదేశించారు.
మరికొద్దిసేపట్లో.. బెంగాల్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్.. శనివారం ఉదయం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ జరుగనుంది. తొలిదశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాల్లో 191 మంది అభ్యర్థులు బరిలో నిలుచోగా.. 73 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ కోసం 7,061 ప్రాంతాల్లో 10,288 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు గానూ.. కేంద్ర ఎన్నికల సంఘం 684 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరింపజేసింది. ఇదిలాఉంటే.. టీఎంసీ, బీజేపీ 29 స్థానాల్లో తమ తమ అభ్యర్థులను బరిలోకి దించగా.. వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లో తమ అభ్యర్థులను నిటెబ్టాయి.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు అసక్తికరంగా మారాయి. శనివారం మొదటి విడతలో30 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పురులియా, బంకురా, జార్‌గ్రామ్, పుర్బా మేదినిపూర్, పశ్చిమ మేదినిపూర్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.
Also read:
How to Become Rich: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ట్రిక్‌తో ధనవంతులు కావచ్చటా..! మీరూ ట్రై చేయండి..!