కశ్మీర్‌ను మళ్ళీ రాష్ట్రంగా మారుస్తాం.. ఎప్పుడంటే!

జమ్మూ కాశ్మీర్, లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చిస్తున్న సందర్భంగా.. ప్రతిపక్షాలు నిప్పులు చెరిగారు. దీనికి అమిత్ షా తనదైన శైలికి వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని.. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దంటూ వారిని మందలించారు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్‌కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తామని షా వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం… జమ్మూకాశ్మీర్‌లో […]

కశ్మీర్‌ను మళ్ళీ రాష్ట్రంగా మారుస్తాం.. ఎప్పుడంటే!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 05, 2019 | 11:55 PM

జమ్మూ కాశ్మీర్, లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చిస్తున్న సందర్భంగా.. ప్రతిపక్షాలు నిప్పులు చెరిగారు. దీనికి అమిత్ షా తనదైన శైలికి వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని.. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దంటూ వారిని మందలించారు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్‌కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తామని షా వ్యక్తం చేశారు.

కశ్మీర్‌కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం…

జమ్మూకాశ్మీర్‌లో రక్తపాతం, ఉగ్రవాదానికి తావు లేకుండా ప్రశాంతమైన ప్రాంతంగా చూడటమే తమ పార్టీ లక్ష్యమని.. అందులో భాగంగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని అమిత్ షా స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని.. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత మళ్ళీ రాష్ట్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అయితే దానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చని.. కానీ ఏదో ఒక రోజు కాశ్మీర్ మళ్ళీ రాష్ట్రం అవుతుందని అమిత్ షా తెలిపారు.