బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. ఈ గోల్డ్ వైపు ఓ లుక్కేయండి..

భారతదేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారాన్ని విరివిగా కొనుగోలు చేస్తారు.

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. ఈ గోల్డ్ వైపు ఓ లుక్కేయండి..
Follow us

|

Updated on: Nov 22, 2020 | 12:56 PM

భారతదేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారాన్ని విరివిగా కొనుగోలు చేస్తారు. ఏ పండుగొచ్చినా, ఫంక్షనొచ్చినా బంగారంతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ గోల్డ్ మార్గాలు బాగా సెట్ అవుతాయని ఫైనాన్షియల్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. బంగారు నగలు కొనడం వల్ల వాటి తయారీ చార్జీలే కాకుండా, విక్రయించే సమయంలో తరుగు కూడా లెక్కిస్తారు. దీనివల్ల కొనుగోలు దారులకు లాస్ తప్పంచి లాభం ఏం ఉండదు. అంతేకాకుండా ఘణ రూపంలో ఉండే బంగారు కైన్స్, బిస్కెట్స్ లాంటివి కొనుగోలు చేసినా సమస్యే. ఎందుకంటే వాటిని భద్రపరచడానకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ బ్యాంక్ లాకర్‌లో దాచినా అద్దె చెల్లించాల్సిందే. అందుకే చాలామంది ఫైనాన్షియర్లు ఎలక్ట్రానిక్ గోల్డ్‌ను ప్రిఫర్ చేస్తున్నారు.

ఇందులో చాలా రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటగా చెప్పుకోవలసింది బంగారం ఎక్స్ఛేంజ్ ఫండ్లు (ఈటీఎఫ్). ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరమవుతాయి. ఈ ఈటీఎఫ్‌లు సేకరించిన సొమ్మును బంగారు లోహం లేదా డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే మ్యూచ్‌వల్ ఫండ్ల లాగానే గోల్డ్ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఫండ్స్ మేనేజర్లు వీటిని సేకరంచి గోల్డ్ సంబంధిత కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతారు. అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్‌లోని గోల్డ్ మైనింగ్ షేర్లలోనూ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లలోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ ప్రభుత్వ పసిడి బాండ్లను జారీ చేస్తోంది. ఈ పథకంలో చేరాలంటే కనీసం ఒక గ్రాము బంగారం కొనాల్సిందే. ఏడాదిలో ఎవరైనా 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీసంస్థలు 20 కిలోల వరకు కొనవచ్చు. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత అవసరమైతే పెట్టుబడి వెనక్కు తీసుకోవచ్చు.