ఇకపై ఆయుర్వేద డాక్టర్లు కూడా శస్త్రచికిత్సలు చేయవచ్చు, నోటిఫికేషన్ విడుదల

ప్రజంట్ జనరేషన్‌లో ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద డాక్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

ఇకపై ఆయుర్వేద డాక్టర్లు కూడా శస్త్రచికిత్సలు చేయవచ్చు, నోటిఫికేషన్ విడుదల
Follow us

|

Updated on: Nov 22, 2020 | 12:44 PM

ప్రజంట్ జనరేషన్‌లో ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద డాక్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారు కూడా ఆపరేషన్లు చేసేందుకు అనుమతిచ్చింది. ఇప్పటికే ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎంకరేజ్ చేసేందుకు పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా..ఈ నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్లు  వివిధ రకాల సాధారణ శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు  ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 రూల్స్‌ను సవరించింది.

షాలియా ( సాధారణ శస్త్రచికిత్స ), షాలక్య (చెవి, ముక్కు, గొంతు, ఇఎన్‌టి, కంటి వ్యాధులు , తల, ఓరో-డెంటిస్ట్రీ) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. శస్త్రచికిత్సా విధానాలకు సంబంధించిన శిక్షణా విధానాలు ఆయుర్వేద అధ్యయనాల పాఠ్యాంశాల్లో చేర్చబోతున్నారు. ఈ కోర్సు పూర్తయిన అనంతరం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాక శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద డాక్టర్లు స్క్రిన్‌ గ్రాఫ్టింగ్‌, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా చేయవచ్చు. ప్రభుత్వం నవంబర్ 19న దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్