వద్దన్న సుజీత్.. చేస్తానన్న వినాయక్.. మాస్ డైరక్టర్ ఖాతాలో మరో రీమేక్..!
ఫిలింనగర్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉన్న వార్తల్లో ఛత్రపతి రీమేక్ ఒకటి. ఈ రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి.

Vinayak Chatrapathi remake: ఫిలింనగర్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా ఉన్న వార్తల్లో ఛత్రపతి రీమేక్ ఒకటి. ఈ రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. ఈ రీమేక్‌ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతుందని, అలాగే దర్శకుడిగా సుజీత్ ఫిక్స్ అయినట్లు టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం సుజీత్ ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. కారణాలు తెలీవు గానీ ఈ రీమేక్‌ని చేయలేనని సుజీత్ అన్నారట. (బాలీవుడ్‌ని వెంటాడుతున్న వరుస మరణాలు.. నటి లీనా మృతి)
ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మాస్ డైరెక్టర్ వినాయక్‌ని సంప్రదించిందని, అందుకు ఆయన ఒప్పుకున్నారని తెలుస్తోంది. కాగా చిరంజీవి నటిస్తోన్న లూసిఫర్ రీమేక్ అవకాశం కూడా మొదట సుజీత్‌కే వచ్చింది. కానీ ఆ తరువాత సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత చిరుకు అత్యంత ఇష్టమైన వినాయక్ లైన్‌లోకి వచ్చారు. ఇక ఇప్పుడు ఛత్రపతి రీమేక్ కూడా అతడి ఖాతాలోనే పడ్డట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (అఖిల్-సురేందర్ రెడ్డి చిత్రం.. హీరోయిన్‌గా రష్మిక మందన్న..!)