అఖిల్-సురేందర్ రెడ్డి చిత్రం.. హీరోయిన్‌గా రష్మిక మందన్న..!
క్రేజీ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్యనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది

Akhil Surender Reddy movie: క్రేజీ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్యనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ కోసం నటీనటులను కూడా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకుడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక పేరు ఇప్పుడు వినిపిస్తోంది. అఖిల్ కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మరో క్రేజీ పెయిర్‌ని అభిమానులు చూడొచ్చు. (Bigg Boss 4: అభిజిత్, అఖిల్‌ల మధ్య గొడవ.. మీరే చూసుకోండన్న నాగార్జున
కాగా ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌లో నటిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా నటిస్తోంది. ఇక మరోవైపు రష్మిక.. బన్నీ సరసన పుష్ప, శర్వానంద్ సరసన ఆడోళ్లు మీకు జోహార్లులో నటిస్తున్నారు. అలాగే తమిళ్‌లో కార్తి సరసన సుల్తాన్‌లో నటించారు. (Bigg Boss 4: టాప్ 5లో ఉండేది వీరే.. కంటెస్టెంట్‌ల బంధువుల మనసులోని మాట