Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేరుశెనగలు తిన్న వెంటనే వీటిని అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా..?

వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి వేరుశెనగ తిన్న తర్వాత ఏ ఆహారాలను తినకూడదు..? ఎందుకు తినకూడదు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేరుశెనగలు తిన్న వెంటనే వీటిని అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా..?
Avoid These Foods After Eating Peanuts
Follow us
Prashanthi V

|

Updated on: Apr 13, 2025 | 11:16 PM

వేరుశెనగలు మనకు అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఇవి ఒకటి. ఇవి ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండటంతో శక్తిని అందిస్తాయి. రోజువారీ డైట్‌లో వేరుశెనగలు భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అయితే వేరుశెనగలు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ మేలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో సమస్యలకు కారణం కూడా కావచ్చు. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేరుశెనగలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. వేరుశెనగల్లోని నూనె పదార్థాలు పాలలోని ప్రొటీన్లతో కలిసి కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. దీనివల్ల వాంతులు, ఉబ్బరం, అసిడిటీ, కడుపులో భారం వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి వేరుశెనగలు తిన్న తర్వాత కనీసం ఒక గంట పాటు పాలు తాగకుండా ఉండటం మంచిది.

నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లలో ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగలు తిన్న వెంటనే ఈ రకమైన పండ్లు తీసుకుంటే గొంతు సమస్యలు, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తినడం వల్ల శరీరం అనారోగ్యంగా మారే ప్రమాదం ఉంటుంది.

చాలా మందికి వేరుశెనగలు తినడం అంటే టీ లేదా కాఫీతో కలిపి తినడం అలవాటుగా ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. టీ లేదా కాఫీలో ఉండే టానిన్ అనే పదార్థం వేరుశెనగల్లోని ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. ఫలితంగా వేరుశెనగ తిన్న ప్రయోజనం పోయే అవకాశం ఉంటుంది. అదీ కాకుండా కొంతమందిలో అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

వేరుశెనగలు తిన్న వెంటనే నువ్వులు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అజీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే వేరుశెనగ తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఇంకా ప్రమాదకరం.

వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త పాటించాలి. వేరుశెనగల్లోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించాలంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అవసరం.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..