డైరెక్టర్ వేటలో చిరు, హీరోయిన్ కోసం బాలయ్య : సీనియర్ హీరోలకు కొత్త కష్టాలు
చిరంజీవి, బాలయ్య కష్టాలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.. అదేంటి టాప్ హీరోలకు పాపం అనే రేంజ్ సమస్యలేముంటాయ్ అని అనుకుంటున్నారా.. ఎందుకుండవండి..

చిరంజీవి, బాలయ్య కష్టాలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.. అదేంటి టాప్ హీరోలకు పాపం అనే రేంజ్ సమస్యలేముంటాయ్ అని అనుకుంటున్నారా.. ఎందుకుండవండి.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడే కష్టాలు ఈ టాప్ హీరోలకు కూడా ఉన్నాయి. బాస్‌ను అల్ట్రా స్టైలిష్ డాన్ కమ్ రెస్పాన్సుబుల్ పర్సన్‌గా అదిరిపోయే లుక్‌లో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో మెగాస్టార్ నటించబోతున్న విషయం తెలిసిందే. కథ రెడీగా ఉన్న ఈ సినిమాకు డైరెక్టర్ మాత్రం సెట్ కావటం లేదు. మెగామూవీ కథ కోసం ఏడాది పాటు కష్టపడిన సుజిత్.. ఫైనల్‌గా ప్రాజెక్ట్ లో లేరు.
సుజిత్ సైడవ్వడంతో లూసీఫర్ రీమేక్ బాధ్యతలు వినాయక్ చేతిల్లో పెట్టారు మెగా ఫ్యామిలీ. ఏమైందో ఏమో గానీ వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత హరీష్ శంకర్, బాబీ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్స్ చేసేందుకు ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు. తనీ ఒరువన్ ఫేం మోహన్ రాజాను ఈ రీమేక్ కోసం తీసుకున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. మోహన్ రాజా తెలుగు వారికి కూడా బాగానే తెలుసు.. సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ సినిమాకు కూడా మోహనే దర్శకుడు. మరి ఈ పేరన్నా ఫైనల్ అవుతుందేమో చూడాలి.
చిరు పరిస్థితి ఇలా ఉంటే.. బాలయ్యది మరో వింత బాధ. ఇప్పటికే సినిమా సెట్స్ మీద ఉంది. బాలయ్య కూడా యాక్షన్‌లోకి దిగిపోయారు. కానీ విలన్, హీరోయిన్ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. వరుస ఫ్లాప్‌ల తరువాత గ్యారెంటీ హిట్ కోసం బోయపాటినే నమ్ముకున్నారు బాలయ్య… బోయపాటి కూడా కం బ్యాక్ కోసం బాలయ్య అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. అంతా ఓకే కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. బాలయ్యకు సరిజోడిని సెట్ చేయటం బోయపాటి వల్ల కావటం లేదు. ముందు అంజలి అనుకున్నారు. తరువాత మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను ట్రై చేశారు. కానీ ఫలితం లేదు. తాజాగా సయేషానే బాలయ్య జోడి అని ఎనౌన్స్ కూడా చేశారు. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీట్…. సయేష్ కూడా అవుట్.. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్‌ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇలా హీరోయిన్ల వేటలో పుణ్యకాలం కాస్త గడిపేస్తున్నారు బీబీ 3 టీం.
బాలయ్యతో రొమాన్స్‌కే కాదు రైవలరీ కూడా ఎవరూ సెట్ కావటం లేదట. బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను తీసుకోవాలనుకున్నారు.. కానీ అదే టైంలో సంజయ్ హెల్త్ పాడవ్వటంతో మనసు మార్చుకున్నారు. హీరో శ్రీకాంత్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు.. ఇప్పటి వరకు ఆలోచన చేస్తున్నారే తప్ప ఇంక ఎవరినీ కన్ఫార్మ్ మాత్రం చేయలేదు. వీళ్లు సెట్ అయ్యేది ఎప్పుడో.. సినిమా స్పీడందుకునేది ఎప్పుడో అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Also Raed :
జీహెచ్‌ఎంసీ పోలింగ్..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం
చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్