మీరు గెలవాలంటే మీ మైండ్‌సెట్ ఎలా ఉండాలో తెలుసా..? సక్సెస్ మంత్రాలు ఇవిగో..!
విజయం సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా సరైన ఆలోచనలు, నమ్మకం, క్రమశిక్షణ, మంచి అలవాట్లు అవసరం. మన రోజువారీ నిర్ణయాలు, చిన్న లక్ష్యాల సాధన, చదువు పట్ల ఆసక్తి వంటి విషయాలు మన జీవితం మీద ప్రభావం చూపుతాయి. ఈ అలవాట్లను పాటిస్తే మీరు విజయవంతులు కావచ్చు.

విజయం అనేది కేవలం అదృష్టం వల్ల లేదా ప్రతిభ వల్ల మాత్రమే రాదు. మన మనసులో ఉండే నమ్మకాలు, మన ఆలోచనలు, సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్న దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మన శ్రద్ధ, మన కృషి మనల్ని ఎంత దూరం తీసుకెళ్లతాయో అదే కీలకం. మనకి ఉండే అలవాట్లు కొన్నిసార్లు మన ముందుకు నడిపించవచ్చు, మరికొన్ని సార్లు మనని వెనక్కి లాగేయొచ్చు.
విజయం సాధించే చాలా మంది ఈ అలవాట్లను అనుసరిస్తారు. వీటి ద్వారా వారు జీవితాన్ని శ్రద్ధగా చూస్తారు. మార్గాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. మనమూ వాటిని పాటిస్తే ముందుకు సాగగలుగుతాము.
డోపమైన్ ప్రభావం.. డోపమైన్ అనేది మనలో ఆనందాన్ని కలిగించే రసాయనం. మనకు ఇష్టం ఉన్న విషయాన్ని పొందినపుడు ఇది ఉత్పత్తి అవుతుంది. చిన్న విజయాలు కూడా ఈ ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజూ ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకుని పూర్తి చేయాలి. ఇవి మనలో ప్రేరణ పెంచుతాయి.
పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం.. ఇతరులకు సహాయం చేస్తే మనకూ సాయం దొరుకుతుంది. ఇది సహజమైన జీవన సూత్రం. మనం ఇచ్చిన సహాయం మనకు తిరిగి వచ్చేలా ఉంటుంది. కానీ ఇది నిజమైనదిగా ఉండాలి. మోసం లేదా తప్పుదారి తప్పితే అది నష్టమే.
ఆలస్యమైన ఆనందం.. తక్షణంగా ఆనందం పొందాలని కాకుండా.. భవిష్యత్తులో వచ్చే పెద్ద విజయాల కోసం వేచి ఉండగలగాలి. చిన్న బహుమతి కన్నా పెద్ద గెలుపు కోసం ఓర్పుగా ఎదురుచూడటం అనేది చాలా ముఖ్యం.
నమ్మకం బలంగా ఉండాలి.. మీరు మీ లక్ష్యాన్ని నమ్మితే మీరు ఎక్కువ కష్టపడుతారు. నమ్మకం లేకపోతే మీ మెదడు దాన్ని నిజం చేస్తుంది. నేను చేయగలను అనే ధైర్యం మీకు మార్గాన్ని చూపుతుంది.
ఎదుగుదల ఆలోచన.. విఫలమవడం అనేది ఓటమి కాదు. అది ఒక పాఠం. ప్రతి తప్పు మనకు ఏదో కొత్తగా నేర్పుతుంది. ఈ ఆలోచన మనల్ని బలంగా మార్చుతుంది. మనం ఎప్పటికీ నేర్చుకునే దశలోనే ఉంటాం.
విజువలైజేషన్ అలవాటు.. మీరు భవిష్యత్తులో ఎలా విజయవంతంగా ఉండబోతారో ముందే మీ మనసులో ఊహించుకోవాలి. చాలా మంది అథ్లెట్లు కూడా రేస్ మొదలవ్వకముందే తాము ఎలా గెలుస్తారో మనసులో ఊహించుకుంటారు. మనసులో గెలిచినవారే నిజ జీవితంలో కూడా గెలుస్తారు.
కృతజ్ఞత భావన.. మనకు ఏమీ లేదని కాదు.. ఇప్పటికే ఉన్నవాటికి కృతజ్ఞత చూపాలి. ఇది మనల్ని సానుకూలంగా ఉంచుతుంది. మనలో వినయం పెరుగుతుంది.
80/20 నియమం.. ఇది ఒక పద్ధతి. మనం చేసే పనుల్లో 20 శాతం పనులే 80 శాతం ఫలితాలను ఇస్తాయి. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో గుర్తించాలి.
భావోద్వేగ మేధస్సు.. స్మార్ట్‌గా ఉండటమే కాకుండా మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. కోపంగా ఉన్నప్పుడు ఆగి ఆలోచించగలగడం అనేది మనకు విజయం సాధించడానికి సహాయపడుతుంది.
రోజువారీ అలవాట్లు.. ప్రతిరోజూ మనం తీసుకునే నిర్ణయాలు, అలవాట్లు మన విజయాన్ని తీర్మానిస్తాయి. క్లారిటీతో లక్ష్యాలను పెట్టుకుంటే ఆ దిశగా సాగిపోవచ్చు. దినచర్యలు, క్రమశిక్షణ వల్ల మనలో దృఢత్వం పెరుగుతుంది.
పుస్తకాలు చదవడం.. చదవడం ఒక గొప్ప అలవాటు. ఇది మనకు కొత్త ఆలోచనలు ఇస్తుంది. పుస్తకాలు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ప్రతి విషయంలో అవి ఉపయోగపడతాయి.
వెంటనే ఫలితాలు రావాలని ఆశపడకూడదు. మార్పు క్రమంగా వస్తుంది. ఓపిక అవసరం. ఎవరి పద్ధతి వారికే సరిపోతుంది. కాబట్టి మీకు సరిపోయే మార్గాన్ని కనుగొనాలి. ఇలా ప్రతి రోజు మానసికంగా మెరుగయ్యే ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది.