బాలీవుడ్‌ని వెంటాడుతున్న వరుస మరణాలు.. నటి లీనా మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టీవీ నటి లీనా ఆచార్య(30) అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె

  • Manju Sandulo
  • Publish Date - 12:26 pm, Sun, 22 November 20

Actress Leena Acharya: బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టీవీ నటి లీనా ఆచార్య(30) అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె.. ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ క్రమంలో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. లీనా మృతిపై బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. (అఖిల్‌-సురేందర్‌ రెడ్డి చిత్రం.. హీరోయిన్‌గా రష్మిక మందన్న..!)

కాగా సేట్‌జీ, ఆప్‌ కే జానే సే, మేరీ హానీ కారక్ బీవీ వంటి సీరియల్‌లో లీనా నటించారు. రాణి ముఖర్జీ నటించిన హిచ్కి చిత్రంలోనూ మెరిశారు. చివరగా క్లాస్ ఆఫ్‌ 2020 అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. (Bigg Boss 4: అభిజిత్‌, అఖిల్‌ల మధ్య గొడవ.. మీరే చూసుకోండన్న నాగార్జున)