గొప్ప మనసు చాటుకున్న శివ కార్తికేయన్.. పేద విద్యార్ధి డాక్టర్ కల నెరవేర్చిన తమిళ హీరో..
రీల్‌లో మాత్రమే కాదు రియల్‌లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు కోలీవుడ్ స్టార్స్. సాయం అంటే చాలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు.
Tamil Hero Siva Karthikeyan: రీల్‌లో మాత్రమే కాదు రియల్‌లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు కోలీవుడ్ స్టార్స్. సాయం అంటే చాలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ పేద విద్యార్ధి డాక్టర్ కలను సాకారం చేశాడు కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్. వివరాల్లోకి వెళ్తే..
తంజావూర్ జిల్లా పూకొల్లై ప్రాంతానికి చెందిన గణేషన్, చిత్ర దంపతుల కుమార్తె సహనా వీధి లైట్ల కాంతుల్లో ప్లస్ టూ చదువుకుని 524 మార్కులతో ఉత్తీర్ణతను సాధించింది. సహనాకు చిన్నప్పటికీ నుంచి డాక్టర్ కావాలని కల. అయితే వాళ్ల ఇల్లు గజ తుఫాన్‌లో కూలిపోవడం.. వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఏమి చేయాలో తెలియదు.
ఇక ఆ కుటుంబ దీన పరిస్థితి హీరో శివ కార్తికేయన్ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే సహనాకు ఆర్ధిక సాయాన్ని అందించారు. తంజావూరులోని ప్రైవేటు నీట్ కళాశాలలో శిక్షణ ఇప్పించారు. దీనితో సహనా ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 273 మార్కులను సాధించి.. తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కించుకుంది.
ఈ సందర్భంగా సహనా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన డాక్టర్ కలను నెరవేర్చుకునే క్రమంలో హీరో శివ కార్తికేయన్ అందించిన సాయం మరువలేనిదని తెలిపింది. తన వైద్య విద్యకు అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరిస్తారన్నారని చెప్పుకొచ్చింది. దీనితో నెటిజన్లు హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read:
మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…
రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..
ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!
వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!