బిగ్ బాస్ 4: మళ్లీ సేవ్ అయిన మోనాల్.. ఎలిమినేట్ కానున్న లాస్య..!

ఎప్పటిలానే మరోసారి లీకుల వీరులు రెచ్చిపోయారు. ఇంకా ఎలిమినేషన్ రోజు రాకముందే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది..

  • Publish Date - 12:19 pm, Sun, 22 November 20
బిగ్ బాస్ 4: మళ్లీ సేవ్ అయిన మోనాల్.. ఎలిమినేట్ కానున్న లాస్య..!

Bigg Boss 4: ఎప్పటిలానే మరోసారి లీకుల వీరులు రెచ్చిపోయారు. ఇంకా ఎలిమినేషన్ రోజు రాకముందే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది ఎవరో సోషల్ మీడియాలో బయటికి వచ్చేసింది. బిగ్ బాస్ 11వ వారానికి గానూ అభిజిత్, సోహైల్, హారిక, మోనాల్, లాస్య, అరియానాలు ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీరిలో ఇప్పటికే సోహైల్ సేవ్ అయినట్లు నిన్నటి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ వారం మోనాల్ హౌస్ నుంచి బయటికి వెళ్తుందని అందరూ భావించినా.. ఊహించని విధంగా యాంకర్ లాస్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఆమెకు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయని వినికిడి. ఇక ప్రతీ వారం లాగానే అభిజిత్ ఈసారి కూడా టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సోహైల్, అరియానా, హారిక కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారని.. అఖిల్ ఫ్యాన్స్‌ కారణంగా మోనాల్ సేవ్ అయిందని సమాచారం. దీనితో యాంకర్ లాస్య ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లనుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!