Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ హీరో కారణంగా ఈ స్టార్ హీరోయిన్ ఒంటరిగా మిగిలిపోయారా.? శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణమా..?

80’s లో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా రాణిస్తుంది.

ఓ హీరో కారణంగా ఈ స్టార్ హీరోయిన్ ఒంటరిగా మిగిలిపోయారా.? శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణమా..?
Shobhana
Follow us
Rajeev Rayala

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 01, 2025 | 5:10 PM

స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల సినీ తారల్లో శోభన ఒకరు. అందం అభినయం కలబోసినా ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది శోభన. విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ నటి. నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు,  గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది.

శోభాన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా.. క్లాసిక్ డాన్సర్ ఆమె.. నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పర్ఫామెన్స్ లు చేసింది. కానీ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ హీరో కారణం అని టాక్ వినిపిస్తుంది. ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది.

అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. శోభన ఆరు భాషల్లో 230కి పైగా సినిమాల్లో శోభన నటించింది. అయితే ఈ బ్యూటీకి ప్రస్తుతం 54 ఏళ్లు. కాగా ఇప్పటివరకు శోభన పెళ్లి చేసుకోలేదు. అయితే శోభన అప్పట్లో ఓ హీరోను ఇష్టపడిందట.. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట. అయితే ఇదే విషయాన్నీ శోభన ఆ హీరోకు చెప్తే ఆయన నో చెప్పాడట. దాంతో ఆమెకు పెళ్లి, ప్రేమ పై ఆసక్తి పోయిందట..దాంతో పెళ్లి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుందట. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది.కాగా ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శోభన.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.