గన్ పట్టుకుని..? బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ హంగామా..!
హీరో అనుకున్నాడో ఏమో.. కానీ.. తుపాకులు చేత్తో పట్టుకొని సినిమా పాటలకు స్టెప్పులేస్తూ హల్‌చల్ చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వెలగబెట్టిన ఘనకార్యం ఇది. ప్రజలకు మంచి, చెడు చూడాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి మారణాయుధాలు ప్రదర్శిస్తూ జల్సా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. హరిద్వార్-ఖాన్‌పూర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కున్వర్ ప్రణవ్ సింగ్ మద్యం సేవిస్తూ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తెగ […]
హీరో అనుకున్నాడో ఏమో.. కానీ.. తుపాకులు చేత్తో పట్టుకొని సినిమా పాటలకు స్టెప్పులేస్తూ హల్‌చల్ చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వెలగబెట్టిన ఘనకార్యం ఇది. ప్రజలకు మంచి, చెడు చూడాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి మారణాయుధాలు ప్రదర్శిస్తూ జల్సా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
హరిద్వార్-ఖాన్‌పూర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కున్వర్ ప్రణవ్ సింగ్ మద్యం సేవిస్తూ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రణవ్ సింగ్ తాను ఓ ప్రజా ప్రతినిధిని అనే విషయం మర్చిపోయి.. ఐటమ్ సాంగ్‌కు తుపాకులు చేత్తో పట్టుకొని డ్యాన్స్ చేశాడు. చుట్టూ మందుబాబులను పోగేసుకొని అల్లర చిల్లరగా ప్రవర్తించాడు.
అంతటితో ఆగకుండా.. గ్లాసులో మందు పోసుకొని.. దాన్ని తాగుతూ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ మందుబాబులతో కలిసి చిందులేశాడు. ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. ప్రణవ్ సింగ్ ప్రవర్తన, తరచూ చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు పార్టీకి తలనొప్పిగా మారాయి.