AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viksit Bharat Sankalp Yatra: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. ఎప్పటి వరకంటే..

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్నూల్ జిల్లా కోడుమూరులో పర్యటించిన టెలికామ్‌ మంత్రి దేవ్‌ సింహ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సర్పంచ్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. నిధుల విడుదల, అధికారుల తీరును నిరసిస్తూ కేంద్రమంత్రిని అడ్డుకోబోయారు సర్పంచులు.

Viksit Bharat Sankalp Yatra: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. ఎప్పటి వరకంటే..
Viksit Bharat Sankalp Yatra
Srikar T
|

Updated on: Dec 17, 2023 | 8:15 AM

Share

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా కర్నూల్ జిల్లా కోడుమూరులో పర్యటించిన టెలికామ్‌ మంత్రి దేవ్‌ సింహ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సర్పంచ్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. నిధుల విడుదల, అధికారుల తీరును నిరసిస్తూ కేంద్రమంత్రిని అడ్డుకోబోయారు సర్పంచులు. ఈ సందర్భంగా.. నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయబోయిన పలువురు సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదుపులోకి తీసుకుని పోలీస్‌‎స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఎందుకు తీసుకెళ్తున్నారని పోలీసులను ప్రశ్నించారు స్థానిక నాయకులు. నిధుల సమస్యపై నిలదీస్తే అరెస్ట్‌ చేయడమేంటని మండిపడ్డారు. గ్రామ సర్పంచులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు ఆందోళనకారులు. ఇక.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. దానిలో భాగంగా.. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం వచ్చే నెల 26 వరకు కొనసాగనుంది.

తెలంగాణలోనూ పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.అందులో భాగంగా.. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లో పర్యటించారు కేంద్ర మత్స్యకార, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా. వికాస్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మత్స్యకార, పశుసంవర్ధక శాఖ సంబంధిత అధికారులు, పాలన యంత్రాంగంతో కలిసి డ్రోన్ స్ప్రే పరికరాన్ని పరిశీలించారు. ఇక.. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం, వివిధ పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్ రోల్ చేయడమే ప్రధాన లక్ష్యంగా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు పురుషోత్తం రూపాలా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..