West Godavari: ఆ ఆలయంలో అన్నప్రసాదం తిని తీరాల్సిందే.! ఆవిరిలో ఉడికించిన సాంబారుకి భక్తులు ఫిదా..

West Godavari: ఆ ఆలయంలో అన్నప్రసాదం తిని తీరాల్సిందే.! ఆవిరిలో ఉడికించిన సాంబారుకి భక్తులు ఫిదా..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2023 | 8:21 PM

ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అనే మాట వింటే ముందుగా గుర్తొచ్చేది విందు భోజనాలు. సాధారణంగా ఏ శుభకార్యాలలోనైనా ముందుగా భోజనాలు ఎలా ఉన్నాయి. వెరైటీలు ఏంటి అనే టాక్ వినిపిస్తుంది. అలాంటిది ఎంతో రుచికరమైన భోజనాలు పెడితే అలాంటి వారిని ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా రుచికరమైన భోజనాలు ప్రత్యేకంగా వివాహలు, ఇతరత్రా శుభకార్యాల్లో మాత్రమే పెడుతుంటారు. కానీ అక్కడ నిత్య అన్నదాన సత్రంలో మాత్రం ప్రతిరోజు అక్కడకి వచ్చిన...

ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అనే మాట వింటే ముందుగా గుర్తొచ్చేది విందు భోజనాలు. సాధారణంగా ఏ శుభకార్యాలలోనైనా ముందుగా భోజనాలు ఎలా ఉన్నాయి. వెరైటీలు ఏంటి అనే టాక్ వినిపిస్తుంది. అలాంటిది ఎంతో రుచికరమైన భోజనాలు పెడితే అలాంటి వారిని ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా రుచికరమైన భోజనాలు ప్రత్యేకంగా వివాహలు, ఇతరత్రా శుభకార్యాల్లో మాత్రమే పెడుతుంటారు. కానీ అక్కడ నిత్య అన్నదాన సత్రంలో మాత్రం ప్రతిరోజు అక్కడకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి రుచికరమైన ఎన్నో వెరైటీలతో కలిగిన భోజనం అందిస్తున్నారు. అంత రుచికరమైన భోజనాలు సైతం ఉచితంగా పెడుతున్నారంటే మీరు నమ్ముతారా..! కానీ అది నిజం.. నిత్యం అక్కడికి వచ్చిన భక్తులకు వెరైటీలతో నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా ప్రసాదం రూపంలో అందిస్తున్న నిర్వాహకులను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు

రుచిగా, వివిధ వెరైటీలతో భోజనం పెట్టే ఏకైక క్రైస్తవ పుణ్యక్షేత్రం పశ్చిమగోదావరి జిల్లాఃలోని నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రమని భక్తులు కొనియాడుతున్నారు. ఇక్కడ అన్నదానశాలలో పెట్టే భోజనాల ఖర్చు మొత్తం భక్తులు, దాతలు ఇచ్చే విరాళాల తోనే సాగుతుంది. గత 23 సంవత్సరాలుగా భక్తులు, దాతలు ఇచ్చిన విరాళాలతోనే అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైవిద్య భరితంగా ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. విశేషమేమంటే, ప్రార్థనలు క్రైస్తవ నియమాలకు కాస్తంత భిన్నంగా హిందూ ఆచారాలకు దగ్గరగా నిర్వహిస్తారు. నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఇలానే ప్రార్థన చేయాలని అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి రూల్స్ ఉండవు. వారు తమకు నచ్చిన విధంగా అక్కడున్న మేరీ మాతను పూజిస్తారు. ఉభయగోదావరి జిల్లాలలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏలూరు పీఠాధిపతులు జయరావు పొలిమేర, పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ చూసుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.