తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పవనంలోని అమ్మవారి ఆలయంలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. 63 ఏళ్ల వృద్ధురాలు ఏడు అడుగుల ముళ్ల పడకపై పడుకుని దైవ వాక్కును వినిపిస్తోంది. ఆమె చెప్పే దైవ వాక్యం ఫలిస్తుందని నమ్మిన భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.