AP Elections: ఏపీ ఎన్నికలకు వేళాయే.. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. డిసెంబర్ 22, 23 తేదీల్లో..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు.

AP Elections: ఏపీ ఎన్నికలకు వేళాయే.. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. డిసెంబర్ 22, 23 తేదీల్లో..
Andhra Pradesh Election
Follow us
pullarao.mandapaka

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 16, 2023 | 9:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్ల పై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదులు చేసాయి. అక్కడితో ఆగలేదు కదా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు సైతం వైసీపీ, టీడీపీ, బీజేపీ లు ఫిర్యాదు చేసాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారనేది ప్రధాన పార్టీల ఆరోపణ.. ఫారం – 7 ద్వారా భారీగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒకవైపు ఓటర్ల జాబితా పై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు..ఈ నెల 26 వ తేదీ వరకూ ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది. ఆ తర్వాత జనవరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ ను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే సీఈసీ అధికారులు బృందం రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది.. ఏపీలో అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ఈసీ పక్కాగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది.

డిసెంబర్ 22, 23 తేదీల్లో అధికారులతో కీలక సమావేశాలు

రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 21 వ తేదీన సాయంత్రం విజయవాడకు చేరుకోనుంది. ఈ నెల 23 వ తేదీన 26 జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు, ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లు, సున్నితమైన ప్రాంతాలు.. ఇలా అన్ని విషయాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకునున్నారు. మొదటి రోజు అన్ని జిల్లాలకు సంబందించిన సమీక్షలు పూర్తి కాకుంటే ఈ నెల 23 వ తేదీ కూడా మిగిలిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇక జిల్లాల అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఈ నెల 23 వ తేదీ మద్యాహ్నం సచివాలయం లో ఎన్నికలకు సంబంధించిన శాఖల అధికారులతో సమావేశమవుతారు. రెండు రోజుల పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు..ఇదే సమావేశంలో ఓటర్ జాబితా పైనా అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది…కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా అన్ని వివరాలు సిద్ధం చేస్తున్నారు.మొత్తంగా ఈసీ పర్యటనతో ఎన్నికల ప్రక్రియకు మొదటి అడుగు పడనుంది.

సీఎం జగన్ ముందస్తు ఎన్నికల ప్రకటన తర్వాత ఈసీ పర్యటన పై ఉత్కంఠ

సాధారణ ఎన్నికల షెడ్యూల్ 20 రోజులు ముందుగానే రావచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటన తో ఇప్పటికే రాజకీయంగా వాతావరణం హీటెక్కింది.. ఇక ఈసీ టీమ్ కూడా రాష్ట్రానికి వస్తుండటంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది.. ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రతినిధుల బృందం నుంచి ఏవైనా సంకేతాలు వస్తాయా అనే ఉత్కంఠ మొదలైంది.మొత్తనికి వచ్చే వారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..