వీడు అసలు మనిషేనా.. అమ్మను అతనితో సన్నిహితంగా మెలగమని చెప్పి.. ఆపై
వీడికంటే దరిద్రుడు ఉంటాడా చెప్పండి. సొంత తల్లినే హనీ ట్రాప్ కోసం ఉపయోగించుకున్నాడు. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్‌కు స్పాట్ పెట్టారు. అయితే అతను పోలీసులను ఆశ్రయించడంతో బాగోతం బయటపడింది. కర్నాటకలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

సభ్యసమాజం తల దించుకునే ఘటన ఇది. మానవ సంబంధాలు ఏ స్థాయికి దిగజారాయో తెలియజేసే ఘటన కర్నాటకలో విజయపుర జిల్లాలో వెలుగుచూసింది. ఇండి టౌన్‌లో పని చేసే ఓ బ్యాంకు మేనేజర్‌ను తల్లీ కొడుకు కలిసి హనీ ట్రాప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ మేనేజర్‌తో శారీరక సబంధం ఏర్పచుకునేలా తల్లిని ఉసిగొల్పాడు కొడుకు. ఆపై వారు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో షూట్ చేసి బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకుకు దగ్గర్లో కొబ్బరి బోండాలు అమ్మే మహిళతో మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది. నవంబర్ 1న తాను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని.. రమ్మని కోరింది సదరు మహిళ. ఇద్దరు చనువుగా మెలుగుతున్నప్పుడు కిటీలో ఫోన్ ఉంచి.. ఆ దృశ్యాలను షూట్ చేసింది. మేనేజర్ ఫోన్‌ను గుర్తించి.. అక్కడ ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. అది పాడయిపోయిందని సమాధానమిచ్చింది.
ఆ తర్వాత.. నవంబర్ 5న ఆమె మేనేజర్‌కు ఫోన్ చేసి.. మనం సన్నిహితంగా ఉన్నప్పుడు ఎవరో వీడియో తీశారని.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. వారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె మేనేజర్‌కు చెప్పింది. ఆ తర్వాత ఆమె కుమారుడు అమూల్, అల్లుడు మహేశ్ బగలి, ఓ పేపర్ రిపోర్టర్ తౌసిఫ్ కలిసి… మేనేజర్‌కు ఫోన్ చేసి 10 లక్షలు ఇవ్వాలని.. లేదంటే ఆ దృశ్యాలను టీవీ ఛానళ్లలో వేస్తామని బెదిరింపులకు దిగారు. తర్జన భర్జన పడిన మేనేజర్.. చివరకు ఏదైతే అది అవుతుందని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎంక్వైరీ చేయగా ఈ మూఠా బాగోతం వెలుగుచూసింది. అమూల్‌ను అరెస్ట్ చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. కాగా ఆ మహిళ సాయంతో గతంలో కూడా వారు పలువరి నుంచి ఇలానే డబ్బు గుంజారని పోలీసుల విచారణలో తేలింది.

Accused Mahesh, Tausheef and Amul
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
