Viral Videos: కొంచెం ఉంటే బస్సు మొత్తం మునిగిపోయేది.. భూమి మీద గడ్డి గింజలున్నాయ్
కేరళలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి.

కేరళలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఐదు (పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్) జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మరో 7 (తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్) జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. కొట్టాయం, ఎర్నాకుళం , ఇడుక్కి , త్రిస్సూర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయంలో పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో కేరళ లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. కకి డ్యాంలో వరద ప్రవాహం పెరిగింది. పంపా నదిలో అయ్యప్ప భక్తులు పుణ్యస్నానాలు చేయకుండా ఆంక్షలు విధించారు. చాలా డ్యాంలలో గేట్లను ఎత్తేశారు. భారీ నుంచి అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీ చేయబడిన ఐదు జిల్లాలలో ఒకటైన కొట్టాయంలో వరదలు పోటెత్తుతున్నాయి. నీటిలో కొట్టుకుపోతున్న కార్లను తాళ్ల సాయంతో బయటకు తీసుకొస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి.
కొట్టాయంలోని మరో గ్రామీణ ప్రాంతం పూన్‌జర్‌లో నీటితో నిండిన వీధిలో ఆర్టీసీ బస్సు చిక్కుకున్న వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ప్రయాణీకులను అతికష్టం మీద బస్సు కిటికీల నుంచి బయటకు తీసుకువచ్చారు. క్షణాల్లో ప్రమాదం తప్పిందని.. అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. మరికాసేపటికే ఆ ప్రాంతం అంతా వరద నీటితో నిండిపోయింది.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక హెచ్చరిక నోట్‌ను విడుదల చేసింది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. పర్వత ప్రాంతాలు, నదుల సమీపంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. సముద్రతీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కి.మీ.లకు చేరుకునే అవకాశం ఉందని… ఈ రోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా