Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా

రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా
AP Telangana Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 16, 2021 | 3:32 PM

ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల కారణంగా సముద్రంలో అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున.. రేపటి వరకూ మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ————————————————— ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాలలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, లో జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది

రాయలసీమ: ———————- ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణాలో మళ్లీ ముసురేయడంతో.. ఇంకోసారి వరదలు ఎక్కడ వెంటాడతాయో అని జనాలు ఆందోళన చెందుతున్నారు. కాగా హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అంబర్‌పేట్‌, రాజేంద్రగన్‌, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణలో ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.

Also Read: Maoist leader RK: మరణం అనంతరం విప్లవ శిఖరం ఆర్కే ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్..