Maoist RK: ఆర్‌ కె మంచి నాయకుడే అయ్యుండొచ్చు.. కానీ తన శక్తి యుక్తుల్ని చట్టబద్ధంగా వినియోగించి ఉంటే బావుండేది: ఎస్పీ

మావోయిస్ట్ అగ్రనేత ఆర్ కె మృతి పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది. ఆర్ కె మంచి నాయకుడే అయ్యుండొచ్చు.. కానీ ఆయన తన శక్తి యుక్తులని చట్టబద్ధంగా వినియోగించి ఉంటే..

Maoist RK: ఆర్‌ కె మంచి నాయకుడే అయ్యుండొచ్చు.. కానీ తన శక్తి యుక్తుల్ని చట్టబద్ధంగా వినియోగించి ఉంటే బావుండేది: ఎస్పీ
RK
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2021 | 1:57 PM

Maoist RK death reactions: మావోయిస్ట్ అగ్రనేత ఆర్ కె మృతి పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది. ఆర్ కె మంచి నాయకుడే అయ్యుండొచ్చు.. కానీ ఆయన తన శక్తి యుక్తులని చట్టబద్ధంగా వినియోగించి ఉంటే సమాజానికి ఇంకా మేలు జరిగి ఉండేదని విశాఖ గ్రామీణ ఎస్పీ బీ కృష్ణారావు అభిప్రాయ పడ్డారు. ఆర్ కె మృతి, తదనంతర పరిణామాలపై టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ ఆయన మరణానికి సంబంధించి క్రెడిట్ పోలీస్ శాఖకు అవసరం లేదన్నారు. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్లినా తమకు అనవసరమని తేల్చి చెప్పారు ఎస్పీ.

40 ఏళ్లుగా పోలీస్ తుపాకీ కానీ కుంబింగ్ కానీ దొరకని ఆర్ కె ని అనారోగ్యంగా ఉన్న సమయంలో నిస్సహాయాలుగా చేసి తుది ముట్టించడాన్ని పోలీస్ శాఖ క్రెడిట్ గా చూస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. మావోయిస్టుల మరణాలని ప్రభుత్వ హత్యాలుగా చెప్పడం అన్యాయమని, మావోయిస్టులు చట్టవిరుద్దంగా అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆరోపించారు ఎస్పీ.

ఆర్కే నో మోర్..! ఒక శకం ముగిసింది. మరి నెక్ట్స్ ఎవరు? ఇక మావోయిస్టుల పతనం మొదలైనట్లేనా? నక్సలిజానికి కాలం చెల్లినట్లేనా? అడవిలో నడిపించే నాయకుడే కరువయ్యాడా? కేంద్ర కమిటీలో ఉన్నది ఎందరు? మిగిలింది ఎందరు? మావోయిస్ట్‌ ఆపరేషన్స్‌లో సెంట్రల్ కమిటీదే కీ రోల్. డెసిషన్స్‌ తీసుకోవాలన్నా …వాటిని అమల్లో పెట్టాలన్నా అంతా అక్కడి నుంచే.! అలాంటి సెంట్రల్ కమిటీ ఇప్పుడు కెప్టెన్‌ లేని టీమ్‌గా మారిందా? ఆర్కే తర్వాత మళ్లీ ఆ స్థాయి నేత లేడా? ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే.

ఆర్కే మరణం అనారోగ్యంతో జరిగిందా.. ఆపరేషన్ సమాధాన్‌లో భాగంగా జరిగిందా పక్కన పెడితే ఒక నాయకుడి మరణం మావోయిస్టుల బలాన్నే దెబ్బతీసింది. అవును.. అసలు నక్సలిజం పుట్టింది, పెరిగింది, ఉవ్వెత్తున ఎగసింది.. ఇన్నాళ్లూ కనీసం ఉనికిలో ఉన్నదీ అంటే కారణం 14మంది కేంద్రకమిటీ సభ్యుల వల్ల. ఈ 14మందిలోనూ కీలకం నలుగురు ఐదుగురు మాత్రమే. కానీ ఇప్పుడు వాళ్లంతా చనిపోవడం, యాక్టివ్‌గా లేకపోవడంతో మావోయిస్టులు నాయకుడు లేని సేనగా మారిపోయారన్న విష్లేషణలు వినిపిస్తున్నాయి.

దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు పది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌. ఇన్ని చోట్లా ఉన్నది ప్రభావం అని కూడా అనలేం. కానీ.. కాస్తోకూస్తో మావోయిస్టులు మిగిలిన ప్రాంతాలని చెప్పుకోవాలి. ఈ 10 రాష్ట్రాల్లోనూ నక్సలిజాన్ని నడుపుతున్నది మొత్తం 14మంది కేంద్రకమిటీ సంభ్యులు. ఇప్పుడు వీళ్లే శారీరకంగా, మానసికంగా బలహీనపడే పరిస్థితి రావడంతో మొత్తం ఉద్యమమే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికొచ్చింది.

వీటన్నింటికంటే పెద్ద సమస్య కరోనా. 14మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ముగ్గురు అనారోగ్యంతో చనిపోతే అందులో ఇద్దర్ని కరోనా కమ్మేసింది. హరిభూషణ్‌, రామన్న కరోనాతో చనిపోతే.. తాజాగా ఆర్కే కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే చనిపోయాడు. ఇక ఉద్యమానికి ఊపిరి అనుకున్న గణపతి.. కొన ఊపిరితో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వయసు ఇప్పటికే 70పైనే ఉంది. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు సహా అనేక అనారోగ్య సమస్యలున్నాయి. ఎటు వెళ్లాలన్నా ఎవరో ఒకరు మోసుకెళ్లక తప్పని దుస్థితి. తాజాగా ఆర్కే మరణంతో AOBలోనూ మావోయిస్టులకు భవిష్యత్‌ ప్రశ్నార్థకమైందనే చెప్పాలి.

సెంట్రల్‌ కమిటీలోని 14 మందిలో ముగ్గురు చనిపోయారు. ఇక మిగిలుంది కేవలం 11 మంది. వీరిలో ఏపీ నుంచి నంబాల కేశవరావు ఉన్నారు. మిగతా 10 మంది తెలంగాణ వారే. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, కడారి సత్యనారాయణ, మోడెమ్ బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌ రావు, గాజర్ల రవి, పక్కా హనుమంతు కేంద్ర కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. మొత్తానికి ఆర్కే తర్వాత మళ్లీ ఆస్థాయిలో నడిపించే నాయకుడైతే ప్రస్థుతానికి కనిపించడం లేదు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉక్కుపాదం మోపుతుండటంతో మావోయిస్టులకు కాలం చెల్లినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read also:  Huzurabad By Election: ఇప్పటి దాక ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు.. హుజూరాబాద్‌లో హోరాహోరీ