AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Leader Shweta: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. వైజాగ్‌‌లో లొంగిపోయిన శ్వేత..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్కే మరణం తర్వాత లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మావోయిస్టు పార్టీ నేత శ్వేత వైజాగ్‌ రూరల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Maoist Leader Shweta: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. వైజాగ్‌‌లో లొంగిపోయిన శ్వేత..
Maoist Party Leader Shweta
Sanjay Kasula
|

Updated on: Oct 16, 2021 | 2:13 PM

Share

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్కే మరణం తర్వాత లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మావోయిస్టు పార్టీ నేత శ్వేత వైజాగ్‌ రూరల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమెపై ఆరు హత్యానేరాలు సహా 46 కేసులు నమోదైయ్యాయి. మావోయిస్టు శ్వేతపై 4 లక్షల క్యాష్ రివార్డు కూడా ఉంది.  ఏవోబీలో చోటు చేసుకున్న పలు కీలక ఘటనల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు శ్వేత. ఆమెతో పాటు ఇంకా ఏవోబీ కమిటీసభ్యులు పోలీసుల ముందు లొంగిపోయేందకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు నాయకురాలు శ్వేత మీడియా ముందుకు వచ్చారు. ఆమె  లొంగిపోవడాన్ని పోలీసులు హర్షం వ్యాప్తం చేస్తున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందవలసిన పోత్సహాకాలు కూడా అందిస్తామన్నారు.

ఇదిలావుంటే.. దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు పది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌. ఇన్ని చోట్లా ఉన్నది ప్రభావం అని కూడా అనలేం. కానీ.. కాస్తోకూస్తో మావోయిస్టులు మిగిలిన ప్రాంతాలని చెప్పుకోవాలి. ఈ 10 రాష్ట్రాల్లోనూ నక్సలిజాన్ని నడుపుతున్నది మొత్తం 14మంది కేంద్రకమిటీ సంభ్యులు. ఇప్పుడు వీళ్లే శారీరకంగా, మానసికంగా బలహీనపడే పరిస్థితి రావడంతో మొత్తం ఉద్యమమే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికొచ్చింది.

ఇవి కూడా చదవండి: CWC – Sonia gandhi: నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని.. జీ 23 నేతల విమర్శలకు చెక్ పెట్టిన సోనియా..