AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: గుడ్ న్యూస్.. త్వరలో కూత పెట్టనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు.. డేట్ ఫిక్స్..

Vande Bharat Sleeper Launch: వందే భారత్ రైళ్లు ఇండియాలో విజయవంతం కావడం, ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో స్లీపర్ రైళ్లను కూడా తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. వీటి తయారీ వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

Vande Bharat Sleeper: గుడ్ న్యూస్.. త్వరలో కూత పెట్టనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు.. డేట్ ఫిక్స్..
Vande Bharat
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2025 | 4:58 PM

Share

వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. విడతల వారీగా ప్రధాన నగరాలన్నింటికీ ఈ సేవలను కేంద్రం ప్రవేశపెట్టింది. వందే భారత్ రైళ్ల రాకతో లగ్జరీతో పాటు వేగంగా ప్రయాణం చేయగలిగే సదుపాయం ప్రజలుకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ట్రైన్లలో ఛైర్ కార్, నార్మల్ సిట్టింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్లీపర్ క్లాస్ ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న వందే భారత్ ట్రైన్లలో అందుబాటులో లేదు. అయతే త్వరలో స్లీపర్ క్లాస్ ట్రైన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఈ డిసెంబర్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. మొదటి ప్రొటోటైప్ స్లీపర్ రైళ్లల్లో కొన్ని సమస్యలు గుర్తించగా.. వాటిల్లో మార్పులు చేస్తున్నారు. వీటి సరిచేసిన తర్వాత మెరుగైన నాణ్యతతో స్లీపర్ రైళ్లు రాబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, అత్యంత ప్రమాణాలతో కూడిన ప్రయాణం అందించేందుకు ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు.

కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, ఒకటి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, విజువల్ డిస్‌ప్లే, కెమెరాలు, మాడ్యులర్ కిచెన్, నైట్ లైటింగ్ వంటి అత్యాధునిక కెమెరాలతో స్లీపర్ రైళ్లు త్వరలో పరుగులు తీయనున్నాయి. ఇక బయో వాక్యూమ్ టాయిలెట్లు, బేబీ కేర్, హాట్ వాటర్ షవర్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. ఇక రీడింగ్ లైట్స్, పవర్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోరింగ్ సిస్టం, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్, ప్రతీ కోచ్‌లో సీసీటీవీ కెమెరా, రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉండనున్నాయి.

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..