AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Arms Racket: పాక్‌ నుంచి డ్రోన్లతో ఆయుధాల అక్రమ రవాణ.. నలుగురు స్మగ్లర్స్ అరెస్ట్!

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హర్యానాలో భారీ పేడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే మరోసారి ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ ఆయుధాల రవాణా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముఠా పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల సాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి 10 సెమీ ఆటోమేటిక్‌ పిస్టల్స్‌, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Delhi Arms Racket: పాక్‌ నుంచి డ్రోన్లతో ఆయుధాల అక్రమ రవాణ.. నలుగురు స్మగ్లర్స్ అరెస్ట్!
Delhi Arms Racket
Anand T
|

Updated on: Nov 22, 2025 | 2:36 PM

Share

గత కొన్ని రోజుల క్రితం హర్యానాలో భారీ ఎత్తున పేలుడు పదార్థాల తయారీని నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నే ఘటన మరువక ముందే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ ఆయుధాల రవాణా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముఠా పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల సాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు పంజాబ్‌ సరిహద్దుల గుండా డ్రోన్‌ల ద్వారా పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలను సేకరించి వాటిని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు ఇవ్వాలని ప్లాన్‌ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు.

గ్యాంగ్‌స్టర్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ . వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వీళ్లు లారెన్స్ బిష్ణోయ్, బంబీహా, గోగీ, హిమాంశు భౌ గ్యాంగ్‌లకు సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌ గ్యాంగ్‌కు పాక్తిస్తాను ISIతో సంబంధాలు ఉన్నట్లు, పాకిస్తాన్‌ మార్గంగా టర్కీ, చైనా దేశాల్లో తయారైన హై-ఎండ్‌ పిస్టల్స్‌ భారత్‌కు సప్లై అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

పల్లుబడిన నలుగురు నిందితుల నుంచి 10 విదేశీ విలువైన పిస్టల్స్‌, 92 బుల్లెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి మొబైల్‌ రికార్డులు, బ్యాంక్‌ వివరాలు, సోషల్‌ మీడియా ఆధారంగా మిగతా సభ్యుల లింకులు, వారి నెట్‌వర్క్‌ను కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!