దేశంలో వ్యాక్సిన్ కొరత ఆరు వారాలు మాత్రమే ! ‘కోవిడ్ కష్టాలు’ మరికొంతకాలం పాటు తప్పవు, ఆరోగ్య నిపుణుడు డా. ఎన్.కె .అరోరా

దేశంలో వ్యాక్సిన్ కొరత ఆరు వారాలు ఉంటుందని కానీ ఈ 'కోవిడ్ కష్టాలను' మనం మరికొంత కాలం భరించక తప్పదని ప్రముఖ నిపుణుడు డాక్టర్ ఎన్.కె. అరోరా చెప్పారు.

దేశంలో వ్యాక్సిన్ కొరత ఆరు వారాలు మాత్రమే ! 'కోవిడ్ కష్టాలు' మరికొంతకాలం పాటు తప్పవు, ఆరోగ్య నిపుణుడు డా. ఎన్.కె .అరోరా
Vaccine Shortage
Follow us

| Edited By: Phani CH

Updated on: May 25, 2021 | 10:04 AM

దేశంలో వ్యాక్సిన్ కొరత ఆరు వారాలు ఉంటుందని కానీ ఈ ‘కోవిడ్ కష్టాలను’ మనం మరికొంత కాలం భరించక తప్పదని ప్రముఖ నిపుణుడు డాక్టర్ ఎన్.కె. అరోరా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ముఖ్యంగా టీకామందుల కొరతను మరికొంత కాలం ఎదుర్కోక తప్పదని ఇమ్యునైజేషన్ పై గల జాతీయ సాంకేతిక సలహాదారుల బృందం చైర్మన్ అయిన ఈయన వెల్లడించారు. ఇండియాలో సార్స్ -కొవ్-2 లక్షణాలతో రోగి కోలుకున్న అనంతరం ముఖ్యంగా 102 రోజుల తరువాత తిరిగి ఇన్ఫెక్షన్ సోకడమన్నది 4.5 శాతం ఉంటుందని బ్రిటన్, అమెరికా దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. కోవిద్ నుంచి కోలుకున్న 1400 మంది రోగులపై స్టడీ అనంతరం ఈ విషయం వెల్లడైందన్నారు. జులై నుంచి కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి నెలకు 20 కోట్ల డోసుల నుంచి 25 కోట్ల డోసులకు పెరుగుతుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయా కంపెనీలు తమ ఉత్పాదక సామర్త్యాన్ని పెంచుకుంటున్నాయని అన్నారు. ఈ టీకామందులకు తోడు జైడస్, క్యాడిలా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, ఇప్పటికే స్పుత్నిక్ వీ ఇండియాకు చేరిందని అరోరా స్పష్టం చేశారు.

ఇన్ఫెక్షన్ సోకి క్లినికల్ రికవరీ అయిన అనంతరం మూడు నెలల పాటు వ్యాక్సినేషన్ వాయిదా వేయాలని కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై గల అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్ కి గురైతే రీ-ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని అయితే ఇది ఆ వ్యక్తి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ అరోరా వివరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: AP Crop Insurance Money: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత ఖాతాల్లో బీమా సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్

కోవిద్ రోగుల డెత్ సర్టిఫికెట్లపైనా ప్రధాని మోదీ ఫోటోలు ఉంచాలట, బీజేపీ ‘మిత్ర పక్ష’ నేత పిలుపు, పొరబాటైందని ట్వీట్ తొలగింపు