ఏడాది అంతానికి పూర్తి జనాభాకు వ్యాక్సినేషన్ అసాధ్యం.. సీరం కంపెనీ చైర్మన్ సైరస్ పూనావాలా

దేశంలోని జనాభా అంతటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతామన్న కేంద్రం ప్రకటనను సీరం సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా కొట్టిపారేశారు.

ఏడాది అంతానికి పూర్తి జనాభాకు వ్యాక్సినేషన్ అసాధ్యం.. సీరం కంపెనీ చైర్మన్ సైరస్ పూనావాలా
Cyrus Poonawalla
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 14, 2021 | 12:04 PM

దేశంలోని జనాభా అంతటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతామన్న కేంద్రం ప్రకటనను సీరం సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా కొట్టిపారేశారు. ఈ లక్ష్యాన్ని కేంద్రం సాధించగలుగుతుందా అన్న మీడియా ప్రశ్నకు ఇది అయ్యే పని కాదని అయన చెప్పారు. రాజకీయ నేతలు ఒక్కోసారి బడాయి పోతుంటారని ఆయన వ్యాఖ్యానించారు. తమ కంపెనీ నెలకు 10 కోట్ల డోసుల టీకామందును ఉత్పత్తి చేస్తుందని..నిజానికి ఇంత హెచ్చుగా ప్రొడ్యూస్ చేయడం సులభం కాదని ఆయన అన్నారు. ప్రపంచంలో ఏ సంస్థ కూడా నెలకు 10 నుంచి 12 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయజాలదని ఆయన పేర్కొన్నారు. అయితే వేలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నందున ఏడాదికి 110 నుంచి 120 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఉత్పత్త్తి చేయవచ్చునన్నారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ మూడో డోసు కూడా తీసుకోవచ్చునని, తమ కంపెనీలోని ఏడెనిమిదివేల మంది ఉద్యోగులు మూడో డోసు కూడా తీసుకున్నారని సైరస్ పూనావాలా తెలిపారు. ఆరు నెలల తరువాత శరీరంలో యాంటీ బాడీలు తగ్గిపోతాయని, అందువల్ల రెండు డోసుల అనంతరం 6 నెలల గ్యాప్ ఇచ్చి మూడో డోసు తీసుకోవచ్చునన్నారు.తాను కూడా మూడవ డోసు తీసుకున్నట్టు చెప్పారు.

రెండు డోసుల మధ్య విరామ కాలం రెండు నెలలు ఉండాలి.. కానీ వ్యాక్సిన్ కొరత దృష్ట్యా కేంద్రం దీన్ని మూడు నెలలకు పొడిగించింది అని ఆయన వివరించారు. వ్యాక్సిన్ ఎగుమతులపై బ్యాన్ విధించాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. 150 దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లాది ప్రజలు దీనిపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. అనేక దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Photo: రోడ్డు మధ్యలో రెండు కుక్కల కౌగిలింత.. కన్నీళ్లు పెట్టుకుంటున్న సోషల్ మీడియా..

Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?