AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ప్రతీ పాఠశాలలో భగవద్గీత పారాయణం తప్పనిసరి! ప్రభుత్వ కీలక నిర్ణయం..

ఉత్తరాఖండ్ ప్రభుత్వం జూలై 14న ఉత్తర్వులు జారీ చేసి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణాన్ని తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ ఒక శ్లోకం పారాయణంతో పాటు, వారపు శ్లోకం ఎంపిక చేసి దాని అర్థాన్ని బోర్డులో రాసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇకపై ప్రతీ పాఠశాలలో భగవద్గీత పారాయణం తప్పనిసరి! ప్రభుత్వ కీలక నిర్ణయం..
Bhagavad Gita
SN Pasha
|

Updated on: Jul 17, 2025 | 10:36 AM

Share

ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14 న ఈ ఉత్తర్వు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాలని విద్యార్థులను ఆదేశించారు. ప్రతిరోజూ ఒక శ్లోకం పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని వారపు శ్లోకంగా ప్రకటించి దాని అర్థాన్ని నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవ విలువలు, ప్రవర్తన, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలను ఎలా అభివృద్ధి చేస్తాయో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 కింద భారతీయ సంప్రదాయం, జ్ఞాన వ్యవస్థ ఆధారంగా విద్యార్థులకు వివిధ విషయాలను బోధిస్తామని విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ కుమార్ సతి తెలిపారు. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర పాఠ్యాంశాలకు సంబంధించి మే 6న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శ్రీమద్ భగవద్గీత, రామాయణాన్ని అందులో చేర్చాలని సూచనలు ఇచ్చారు.

రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో భగవద్గీత, రామాయణాన్ని కూడా చేర్చారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ప్రభుత్వ చొరవను స్వాగతిస్తూ పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని బోధించడం, వాటిని ప్రజలకు పరిచయం చేయడం చాలా మంచి విషయమని అన్నారు . రాముడు, కృష్ణుడు ఇద్దరూ మన పూర్వీకులని, ప్రతి భారతీయుడు వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి