Uttar Pradesh: లంచ్ బాక్స్‌లో నాన్‌వెజ్ తీసుకొచ్చిన నర్సరీ విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్..!

ఉత్తరప్రదేశ్‌ అమ్రోహాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లంచ్ బాక్స్‌లో నాన్ వెజ్ ఫుడ్ తీసుకొచ్చాడని నర్సరీ చిన్నారిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. చిన్నారి తల్లి, ప్రిన్సిపాల్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: లంచ్ బాక్స్‌లో నాన్‌వెజ్ తీసుకొచ్చిన నర్సరీ విద్యార్థి..  సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్..!
Non Veg In Lunch Box
Follow us

|

Updated on: Sep 06, 2024 | 12:41 PM

ఉత్తరప్రదేశ్‌ అమ్రోహాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లంచ్ బాక్స్‌లో నాన్ వెజ్ ఫుడ్ తీసుకొచ్చాడని నర్సరీ చిన్నారిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. చిన్నారి తల్లి, ప్రిన్సిపాల్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘స్కూల్‌కి నాన్‌వెజ్‌ తెచ్చే పిల్లలకు మంచి విలువలు నేర్పడం మాకు ఇష్టం లేదు’ అని ప్రిన్సిపాల్ వీడియోలో తల్లితో అన్న మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

అందరికి నాన్ వెజ్ తినిపించి తమ మతంలోకి మారాలని బాలుడు పదే పదే చెబుతున్నాడని ప్రిన్సిపల్ ఆరోపించారు. పాఠశాలకు నాన్ వెజ్ తీసుకువస్తానని చిన్నారి ఒప్పుకున్నాడని ప్రిన్సిపాల్ చెబుతుండగా, అతని తల్లి తిరస్కరించింది. ప్రిన్సిపాల్ ఆరోపణలను మహిళ తోసిపుచ్చింది. తన 7 ఏళ్ల కొడుకు అలాంటి విషయాల గురించి మాట్లాడలేడని, క్లాస్‌లోని విద్యార్థులను రెండు వర్గాలుగా వేరు చేస్తున్నారంటూ తన బిడ్డ గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తోందని ఆ మహిళ చెప్పింది.

అయితే, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నందున పాఠశాల రిజిస్టర్ నుండి పిల్లల పేరును తొలగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దేశంలోని మతసమస్యలపై పాఠశాలలో విద్యార్థులు చర్చిస్తున్నారని, ప్రిన్సిపాల్ వాదనలను చిన్నారి తల్లి కొట్టిపారేసింది. మరో చిన్నారి తన కొడుకును కొట్టి తరచూ వేధిస్తున్నాడని మహిళ ఆరోపించింది. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్‌, మరో విద్యార్థిపై ఆరోపిస్తూ సదరు మహిళ పాఠశాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

దాదాపు 7 నిమిషాల నిడివి గల వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంపై స్పందించిన అమ్రోహా పోలీసులు, డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIS) చర్య తీసుకున్నారని తెలిపారు. ఇదిలాఉండగా, ఈ విషయంపై దర్యాప్తు చేసి తదుపరి చర్య తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌