ఇదో రియల్ నాగిని.. తన జంట పాముని చంపేసిన యువకుడిని వెంటాడి కాటేస్తున్న పాము..
పాము పగ సైన్స్ కు నమ్మకానికి సంబంధించిన వాదనలు, ప్రతి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ పాము ఓ యువకుడిని వేధిస్తోంది. ఒకే పాము తమ కుమారుడిని నాలుగుసార్లు కాటేసిందని యువకుడి కుటుంబీకులు పేర్కొన్నారు. ఈ పాము కాటు ఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.
పాములు పగబడతాయని..తమా ప్రతీకారం తీర్చుకునే వరకూ మనుషులను వెంటాడి వేధిస్తాయని కథలు విని ఉంటారు. సినిమాల్లో చూసి ఉంటారు. అయితే ఇలాంటి నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలోని ఒక యువకుడు కర్రతో పొలంలోని జంట పాములపై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో గాయ పడకుండా ఒక పాము పారిపోయింది. మరొక పాము చనిపోయింది. అప్పటి నుంచి పారిపోయిన పాము కర్రతో దాడి చేసిన యువకుడిని పదే పదే కాటేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆ పాము యువకుడిని నాలుగు సార్లు కాటు వేసింది. దీంతో యువకుడు.. అతని కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
పాము భయంతో ఆ యువకుడు సొంత గ్రామం విడిచి బంధువుల ఊరికి వెళ్ళిపోయాడు. అయితే కొన్ని నెలలకు తిరిగి రాగానే పాము ఆ యువకుడిని మళ్లీ కాటు వేసింది. ఇది సవాజ్‌పూర్ కొత్వాలిలోని దేవ్‌పూర్ గ్రామానికి చెందినది. ఇక్కడ నివసించే ఆనంద్ లాల్ కుమారుడు చంద్రశేఖర్ (18) నాలుగు సార్లు పాము కాటుకు గురయ్యాడు. కొద్దిరోజుల క్రితం పొలంలో ఉన్న ఒక జంట పాములను కర్రతో కొట్టానని.. అప్పుడు ఒక పాము చనిపోయిందని.. మరొక పాము పొదల్లో దాక్కుందని చంద్రశేఖర్ చెప్పాడు.
అయితే పాముని కొట్టిన విషయాన్నీ చంద్రశేఖర్ మరచిపోయాడు. అయితే పాము మాత్రం తమపై దాడి చేసిన చంద్ర శేఖర్ ని మరచిపోనట్లు ఉంది.. సమయం కోసం చూసింది. ఆగస్టు 29న పొలానికి వెళ్తుండగా దారిలో పాము కాటేసింది. వెంటనే వైద్య కళాశాలలో చికిత్స పొంది ఆరోగ్యవంతుడయ్యాడు. అక్టోబరు 15న చంద్ర శేఖర్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము మళ్ళీ కాటు వేసింది. అప్పుడు మాత్రం చంద్ర శేఖర్ పరిస్థితి విషమం అయింది. దీంతో వైద్యులు లక్నోకు తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత చంద్ర శేఖర్ తన కుటుంబ సభ్యులకు తను పాముని కొట్టడం.. చనిపోవడం గురించి సమాచారం అందించాడు.
నాలుగు సార్లు పాము కాటు
కుటుంబ సభ్యులు అతనిని గ్రామం నుంచి బంధువుల వద్దకు పంపారు. అక్కడ అతను నెల రోజుల పాటు ఉండి తిరిగి వచ్చి పొలాలకు వెళుతుండగా.. నవంబర్ 21న మూడోసారి పాము కాటు వేసింది. ఈసారి కూడా సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు చంద్ర శేఖర్ కు కాపలాగా ఉండి.. దోమతెరలో పడుకోబెట్టడం మొదలుపెట్టారు, అయితే డిసెంబర్ 3న ఇంట్లో దోమతెరలో నిద్రిస్తున్న సమయంలో నాలుగోసారి పాము అతని వేలిపై కాటు వేసింది. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పదే పదే పాము దాడి చేయడంతో యువకుడితోపాటు అతని కుటుంబసభ్యుల్లో కలకలం రేగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..