AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామ మందిర రంగ మండప శిఖరం సిద్ధం.. ప్రాణ్ ప్రతిష్ఠ’ వార్షికోత్సవం కోసం కమిటీ ఏర్పాటు

కోట్లాది హిందువుల కల తీరుతూ గత ఏడాది జనవరి 11న రామ జన్మ భూమి అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. రామ మందిరం నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతూనే ఉన్నాయి. రామ ఆలయంలోని ఐదు మంటపాలలో ఒకటైన రంగ మండప శిఖరం పూర్తిగా సిద్ధంగా ఉంది. జనవరి 11న ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం 'ప్రతిష్ఠ ద్వాదశి' వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

Ayodhya: అయోధ్య రామ మందిర రంగ మండప శిఖరం సిద్ధం.. ప్రాణ్ ప్రతిష్ఠ' వార్షికోత్సవం కోసం కమిటీ ఏర్పాటు
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Dec 12, 2024 | 5:53 PM

Share

అయోధ్యలోని బాల రామయ్య దేవాలయంలోని ఐదు మంటపాలలో ఒకటైన రంగ మండప శిఖరం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇది ఆలయంలో ముఖ్యమైన భాగం. ఇప్పటి నుంచి సరిగ్గా ఒక నెల అంటే జనవరి 11, 2025న.. రామ మందిర ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి’ని ఘనంగా జరుపుకోనున్నట్లు తెలియజేసారు.

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనుల్లో ఐదు మంటపాలలో రంగ మండప శిఖరం పూర్తిగా సిద్ధమైంది. ‘ప్రతిష్ఠ ద్వాదశి’ రోజున మొదటి వార్షికోత్సవ వేడుకల కోసం ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ద్వారా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలను నిర్ణయిస్తుంది.

11 జనవరి 2025న ‘ప్రతిష్ఠ ద్వాదశి’

ఈసారి ప్రతిష్ట ద్వాదశి 11 జనవరి 2025న వస్తుంది. ఇది బాల రామయ్య గర్భ గుడిలో కొలువుదీరిన రోజునే.. మొదటి వార్షికోత్సవంగా జరుపుకుంటారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగిందని.. అయితే హిందూ తిధి ప్రకారం ఈసారి ద్వాదశి తిథి జనవరి 11న వస్తోంది. ఈ రోజున అత్యంత వైభవంగా జరుపనున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

3 రోజుల పండుగలో వివిధ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పగలు ప్రత్యేక ఉత్సవాలు, రాత్రి కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా బాల రామయ్య పవిత్రోత్సవం మొదటి వార్షికోత్సవాన్ని చారిత్రాత్మకంగా, గొప్పగా చేయనున్నారు. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు

శివుడు, సూర్యుడు, దుర్గాదేవి, అన్నపూర్ణ, గణేష్, హనుమంతుని ఆలయాల వంటి సప్తఋషి దేవాలయం, గోడ వెంట నిర్మిస్తున్న ఇతర ఆలయాల నిర్మాణం కూడా వేగం పుంజుకోవడం గమనార్హం. ఇటీవల నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సమీక్షా సమావేశం అనంతరం కూలీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ