AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్‌ పట్టపగలే జరిగిన దారుణ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. కుటుంబ వివాదాలు, విడాకుల వ్యవహారం చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్య మిశ్రాను ఆమె భర్త మానస్ బాజ్‌పాయ్ కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లిన అతడు తన సొంత సోదరిని కూడా హత్య చేశాడు.

నడిరోడ్డుపై బ్యాంకు మేనేజర్ దారుణ హత్య.. ఇంటికెళ్లి సోదరిని చంపి తానూ ఆత్మహత్య!
Lucknow Crime News
Balaraju Goud
|

Updated on: Aug 20, 2026 | 3:14 PM

Share

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్‌ పట్టపగలే జరిగిన దారుణ జంట హత్యలతో నగరం ఉలిక్కిపడింది. కుటుంబ వివాదాలు, విడాకుల వ్యవహారం చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్య మిశ్రాను ఆమె భర్త మానస్ బాజ్‌పాయ్ కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లిన అతడు తన సొంత సోదరిని కూడా హత్య చేశాడు. చివరికి తనకు తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలు దివ్య మిశ్రా ప్రముఖ జర్నలిస్ట్ ప్రజ్ఞా మిశ్రా సోదరిగా పోలీసులు గుర్తించారు.

గురువారం (ఆగస్టు 20) ఉదయం దివ్య మిశ్రా ఎప్పటిలాగే గోమతినగర్‌లోని బ్యాంకుకు విధులకు హాజరయ్యారు. కొద్దిసేపటికే ఆమె మొబైల్‌కు ఫోన్ రావడంతో బ్యాంకు బయటకు వెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మానస్ రెండు పిస్టళ్లతో బ్యాంకు గేటు వద్ద వేచి ఉన్నాడు. దివ్య బయటకు రాగానే ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో మానస్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు తగలడంతో దివ్య అక్కడికక్కడే కుప్పకూలారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

కాల్పుల అనంతరం మానస్ ఆటోరిక్షాలో హుసదియా స్క్వేర్‌లోని తన నివాసానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిపై కూడా కాల్పులు జరిపి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. దీంతో కొద్దిసేపటి వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, నిందితుడు మానస్ బాజ్‌పాయ్ తన వాట్సాప్ స్టేటస్‌లో, “నాకు ద్రోహం చేసినందుకు ఈరోజు నా భార్యను చంపాను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఆమె సోదరి ప్రజ్ఞ, భరత్‌లకు అంతా తెలుసు…” అని రాశాడు. ఈ సందేశం ద్వారా నిందితుడు ఈ మొత్తం ఘటనను అత్యంత చాకచక్యంగా ప్లాన్ చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. అతను తన భార్య హత్యను సమర్థించుకోవడమే కాకుండా, తన సోదరిని చంపి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కూడా పేర్కొన్నాడు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దివ్య, మానస్ మధ్య చాలాకాలంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఈ వివాదం కోర్టులో విడాకుల పిటిషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మానస్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేరస్థలాన్ని స్వాధీనం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్, కాల్ డీటైల్ రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే పట్టపగలు కాల్పులు జరగడంతో భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ