AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో తల్లిపాలలో యురేనియం గుర్తింపు..! శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

బిహార్‌లోని బాలింతల తల్లిపాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, శిశువులకు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరించారు. అయితే, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నమూనాలు WHO అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఓరీ దేవుడో తల్లిపాలలో యురేనియం గుర్తింపు..! శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
Breast Milk
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2025 | 1:43 PM

Share

నవజాత శిశువుకు తల్లి పాలు ఉత్తమ ఆహారం. కానీ, ఇప్పుడు అవే విషంగా మారే ప్రమాదం ముంచుకోస్తోంది. తాజా పరిశోధనలో తల్లి పాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. బీహార్‌లోని 6 జిల్లాల్లో జరిగిన పరిశోధనలో 40 మంది బాలింతల తల్లిపాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

చాలా కాలంగా భూగర్భ జలాల్లో ఉన్న ఈ విషపూరిత మూలకం నవజాత శిశువుల శరీరాలకు నేరుగా చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధ్యయనంలో పేర్కొన్న యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయన్నారు.

ఈ పరిశోధనను పాట్నాకు చెందిన మహావీర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ అశోక్ ఘోష్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ అశోక్ శర్మ, అతని బృందం కూడా ఇందులో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

6 జిల్లాల నుండి 40 మంది తల్లుల పాల నమూనాలను పరీక్షించారు. అక్టోబర్ 2021, జూలై 2024 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనంలో, భోజ్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, కతిహార్, నలంద నుండి 17–35 సంవత్సరాల వయస్సు గల 40 మంది తల్లుల నుండి పాల నమూనాలను సేకరించారు. అన్ని నమూనాలలో యురేనియం (U238) ఉన్నట్టుగా గుర్తించారు.. దాని స్థాయిలు 0 నుండి 5.25 µg/L వరకు ఉన్నాయి. తల్లి పాలలో యురేనియంకు ఎటువంటి సురక్షిత పరిమితి లేదు. నివేదిక ప్రకారం, దాదాపు 70 శాతం మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాలను కలిగించే స్థాయిలలో యురేనియంకు గురయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us