Success Story: పరీక్షకు వెళ్తూ ప్రమాదం..14 ఆపరేషన్లు.. నడవలేవంటూ వదిలేసిన భర్త.. నేడు సివిల్స్ లో టాపర్..
Preeti Beniwal Success Story: కడుపునొప్పి , తలనొప్పి వంటి చిన్న చిన్న శారీరక ఇబ్బందులు వస్తేనే .. భరించలేం అంటూ తనువు చాలిస్తున్న వారు ఎందరో.. ఇక ఒకటి రెండు ఆపరేషన్లు చేయించుకుంటే..
Preeti Beniwal Success Story: కడుపునొప్పి , తలనొప్పి వంటి చిన్న చిన్న శారీరక ఇబ్బందులు వస్తేనే .. భరించలేం అంటూ తనువు చాలిస్తున్న వారు ఎందరో.. ఇక ఒకటి రెండు ఆపరేషన్లు చేయించుకుంటే చాలు.. ఇక మా పని అయిపోయింది. ఏమీ చెయ్యలేం అంటూ శరీరకంగానే కాదు మానసికంగా కృంగిపోయేవారి గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం.. అలాంటి ఓ మనిషి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 14 సార్లు ఆపరేషన్లు చేయించుకుంటే.. ఆ వ్యక్తి జీవితాంతం మంచానికే పరిమితమయ్యి.. కాలం వెల్లదీస్తాడు.. అయితే ఓ అమ్మాయి మాత్రం.. తనకు 14 ఆపరేషన్లు జరిగినా.. భయపడలేదు.. ఏదోలా బతకాలి అనుకోలేదు..చికిత్స జరిగింది శరీరానికే కానీ నా సంకల్పానికి కాదంటూ దైర్యం కోల్పోకుండా సంకల్పంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.. పట్టుదలతో పోరాడితే.. సాధించలేదని ఏమీ లేదని నిరూపించింది. సివిల్స్ లో ఉత్తీర్ణురాలైంది. కల నేర్చుకుంది ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం..
హర్యాణాలోని కర్నాల్ జిల్లా దూపేడి గ్రామానికి చెందిన సురేష్, బబిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ దంపతులకు కుమార్తె కుమారుడు. కుమార్తె పేరు ప్రీతి బెనివాల్, కుమారుడి పేరు పంకజ్ బెనివాల్. ప్రీతి తండ్రి సురేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి.. తల్లి అంగన్ వాడీ లో టీచరు. ప్రీతి 2013లో ఎంటెక్ పూర్తి చేసి.. స్థానిక గ్రామీణ బ్యాంక్‌లో క్లరికల్ ఉద్యోగంలో జాయిన్ అయింది. అనంతరం మరో మూడేళ్లు బహదూర్‌గఢ్‌లో ఉద్యోగిగా బాధ్యతలను నిర్వహించింది. ఇక 2016లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ గ్రేడ్ II ఉద్యోగం సాధించి. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో తల్లిదండ్రులు ప్రీతికి మట్లౌడా బ్లాక్‌లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. ఇక అదే ఏడాది డిసెంబర్‌లో ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కోసం జరిగే ఎగ్జామ్స్ కోసం గజియాబాద్‌కు వెళ్తూ ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదానికి గురైంది. రైళ్లు ఎక్కేసమయంలో కాలు జారీ ప్రీతి కిందపడిపోయింది. అప్పుడు ఆమె మీద నుంచి మూడు రైల్వే బాక్సులు వెళ్లాయి. దీంతో ప్రీతి తీవ్రంగా గాయపడింది. ప్రీతి బతకడానికి పోరాడితే.. వైద్యులు బతికించడానికి అనేక ఆపరేషన్లు చేశారు. ప్రీతిని బతికించడానికి వైద్యులు బైపాస్ సర్జరీ సహా మొత్తం 14ఆపరేషన్లు చేశారు. దీంతో ప్రీతి బెడ్ కు పరిమితమైపోయింది. దీంతో నడవలేని భార్య అవసరం.. భర్త.. కోడలు వద్దంటూ అత్తమామలు వదిలేశారు.
ప్రీతి ఒక ఏడాది పాటు మంచానికి పరిమితమైంది. అంతేకాదు తన పరిస్థితికి, భర్త వదిలేసి వెళ్లడంతో బాధపడడం మొదలు పెట్టారు. అయితే కన్న కూతురుని అక్కున చేర్చుకున్న తల్లిదండ్రులు.. ప్రీతికి అండగా నిలబడ్డారు. జీవితం ఇంతటితో ఆగిపోలేదని.. మళ్ళీ చదువుకోమని ప్రోత్సహించారు. దీంతో సివిల్స్ కు చదవడం మొదలు పెట్టారు. ప్రీతి.. మొదటి సారి సివిల్స్ రాశారు.. అప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోరు, నిరాశ పడకుండా మళ్ళీ రెండోసారి సివిల్స్ రాయగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు.. అయితే మెయిన్స్ లో ఫెయిల్ అయ్యారు. మూడోసారి ఎలాగైనా సివిల్స్ లో పాస్ కావాలని మరింత పట్టుదలతో ప్రయత్నం చేశారు. 2020 సివిల్స్ పరీక్షల్లో 754 ర్యాంకుతో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే రిజల్ట్ వచ్చే సమయంలో ప్రీతి 2021 జనవరిలో ఢిల్లీలో మరో ఉద్యోగం సాధించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌ట్రనల్ అఫైర్స్‌లో ఉద్యోగం పొందారు. .
తాను ఈరోజు సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించడానికి కారణం తన తండ్రి సురేష్ కుమార్ , అంగన్ వాడీ వర్కర్ తల్లి బబిత స్ఫూర్తి అని చెప్పారు. అంతేకాదు తనకు ప్రతి విషయంలోనూ సోదరుడు పంకజ్ బెనివాల్ ఎంతో మద్దతుగా నిలిచారని.. ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రజలను సేవలను అందిస్తానని చెబుతున్నారు ప్రీతి.
Also Read: Revati Nakshatra: రేవతి నక్షత్రంలో పుట్టినవారు అదృష్టవంతులు, తెలివిగలవారట.. వీరితో స్నేహం ఎలా ఉంటుందంటే..